Sundeep Kishan : సందీప్ కిషన్ యాక్షన్ డ్రామా 'సిగ్మా' - డైరెక్టర్‌గా దళపతి విజయ్ కుమారుడి ఎంట్రీ... ఫస్ట్ లుక్ వేరే లెవల్
Sigma Movie : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కొత్త మూవీకి 'సిగ్మా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా యాక్షన్ పోస్టర్ అదిరిపోయింది.

Sundeep Kishan's Sigma Movie First Look Unveiled : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ మూవీతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సాగుతుండగా... తాజాగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
యాక్షన్ ప్యాక్ట్ సందీప్
ఈ సినిమాకు 'సిగ్మా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బంగారం, డబ్బు కట్టలపై చేతికి కట్టు కట్టుకుంటూ సీరియస్ లుక్‌లో రిలీజ్ చేసిన సందీప్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందు వాటి కంటే డిఫరెంట్‌గా పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించనున్నారు.
Presenting the Title of #JSJ01 - #SIGMA⚡
— Lyca Productions (@LycaProductions) November 10, 2025
The quest begins. 🎯@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @Cinemainmygenes @krishnanvasant @Dir_sanjeev #BenjaminM @hariharalorven @ananth_designer @SureshChandraa @UrsVamsiShekar… pic.twitter.com/Dggm6zx3Il
'సిగ్మా' టైటిల్ వెనుక...
ఈ టైటిల్ వెనుక ఆసక్తికర విషయాలను మేకర్స్ వెల్లడించారు. 'సిగ్మా' అంటే నిర్భయమైన ఒంటరి తోడేలు అని అర్థం. మూవీలో హీరో సొసైటీ రూల్స్ అధిగమించి అట్టడుగు స్థాయి నుంచి తన ఉన్నత లక్ష్యాలను ఎలా ఛేదించాడో చూపించనున్నట్లు తెలుస్తోంది. ట్రెజర్ హంట్ థ్రిల్‌తో పాటు ఎకామనీ క్రైమ్, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ అన్నీ కలగలిపి ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. సందీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, కిరణ్ కొండా, సంపత్ రాజ్, సుదర్శనన్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. మ్యూజిక్ లెజెెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... 65 రోజుల్లోనే 95 శాతం షూటింగ్ పూర్తైనట్లు మూవీ టీం వెల్లడించింది. ఓ పాట మాత్రమే మిగిలి ఉందని దర్శకుడు జాసన్ సంజయ్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది వేసవి ప్రారంభంలో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళ, తెలుగు భాషల్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















