అన్వేషించండి
Advertisement
T20 World Cup 2024: బౌలర్ల ఆధిపత్యం మరీ ఇంతలానా, గత ఏ ప్రపంచకప్‌లో లేదట
T20 World Cup 2024: ఈ టీ 20 ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. అరి వీర టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా నెమ్మదిగా ఆడాల్సిన పరిస్థితి కనిపించింది.
Bowlers have dominated in usa world cup : టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇప్పటివరకూ జరిగిన లీగ్ మ్యాచుల్లో కేవలం మూడుసార్లు మాత్రమే 200కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. లీగ్ దశలో 37 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఎనిమిది జట్లు సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించగా.... 12 జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. ఇక గ్రూప్ దశలో ఇప్పటివరకూ జరిగిన అన్ని ప్రపంచకప్‌లతో పోలిస్తే అతి తక్కువ రన్‌రేట్(Runrate) నమోదైంది ఈ ప్రపంచకప్‌లోనే. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 6.71 రన్‌రేట్ నమోదైంది. అంతకుముందు 2021 టీ 20 ప్రపంచకప్‌లో 7.43 రన్‌రేట్ నమోదైంది. 2021తో పోలిస్తే ప్రస్తుతం 2024లో ప్రతీ ఓవర్‌కు 0.72 శాతం పరుగులు తక్కువ నమోదయ్యాయి. అంతేకాక ఈ ప్రపంచకప్‌లో సుమారు ప్రతీ 18 పరుగులకు ఒక వికెట్ పడింది. ఇదీ కూడా టీ 20 ప్రపంచకప్‌లో చాలా తక్కువ పరుగులకు ఒక వికెట్ కోల్పయింది. 2022లో ప్రతీ 21 పరుగులకు ఒక వికెట్ కోల్పోగా ఈ ప్రపంచకప్‌లో అది 18 పరుగులకు దిగి వచ్చింది. బౌండరీలు, సిక్సర్ల విషయంలోనూ అదే జరిగింది. ఈ టీ 20 ప్రపంచకప్‌లో సగటున ప్రతీ ఎనిమిది బంతులకు ఒక బౌండరీ కానీ, సిక్స్ కానీ వచ్చింది. గత ప్రపంచకప్‌లతో పోలిస్తే ఇది కూడా చాలా ఎక్కువ బంతులకు ఒక భారీ షాట్ వచ్చినట్లు లెక్క.
బౌలర్లదే ఆధిపత్యం...
ఈ టీ 20 ప్రపంచకప్‌లో గతంలో ఏ ప్రపంచకప్‌లో లేని విధంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడారు. ఈ ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు కేవలం 18 పరుగులు మాత్రమే నమోదు చేశారు. గత ప్రపంచకప్‌లతో పోలిస్తే ఇది ఆరు పరుగులు తక్కువ. టాపార్డర్ బ్యాటర్ల సగటు కూడా కేవలం 110 మాత్రమే ఉందంటే ఈ ప్రపంచకప్‌లో బౌలర్ల ఆధిపత్యం ఎలా కొనసాగిందో అంచనా వేయవచ్చు. టాపార్డర్ బ్యాటర్లు ప్రతీ ఏడో ఇన్నింగ్స్‌లో ఒకసారే డకౌట్ అయినప్పటికీ... 50 పరుగులు చేయడానికి మాత్రం 14 ఇన్నింగ్స్‌లు పట్టిందంటే పొట్టి ప్రపంచకప్‌లో బ్యాటర్లు ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా పిచ్‌లపై పేసర్లు ఆధిపత్యం కొనసాగించగా.. వెస్టిండీస్‌లో స్పిన్నర్లు మాయాజాలం చేస్తున్నారు. న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడా మైదానాల్లో జరిగిన 13 మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్లు 125 వికెట్లు తీశారు. స్పిన్నర్లు కేవలం 34 వికెట్లు మాత్రమే పడగొట్టారు. అమెరికా పేస్ పిచ్‌లపై సీమర్లే ఎక్కువ బౌలింగ్ చేశారు.
కానీ వెస్టిండీస్‌లో స్పిన్నర్లు మెరుగ్గా రాణించారు. వెస్టిండీస్ పిచ్‌లై జరిగిన 24 మ్యాచ్‌లలో స్పిన్నర్లు 6.61 ఎకానమీతో 116 వికెట్లు తీశారు. అయిదు వికెట్ల ఘనతలు, నాలుగు వికెట్ల ఘనతలను కూడా స్పిన్నర్లు సాధించారు. ఈ టీ 20 ప్రపంచకప్‌లో డాట్ బాల్స్, మెయిడెన్ ఓవర్లు ఎక్కువగా నమోదయ్యాయి. కివీస్ పేసర్ ఫెర్గూసన్.. టీ ప్రపంచ కప్‌లో పాపువా న్యూ గినియాపై తిరుగులేని రికార్డు నమోదు చేశాడు. 24 డాట్ బాల్స్ వేసి నాలుగు మెయిడెన్‌లతో ముగించాడు. మూడు వికెట్లు కూడా తీశాడు. ఈ ప్రపంచ కప్‌లో 20 డాట్ బాల్స్ వేసిన ఘనత ఎనిమిది సార్లు నమోదైందంటే బౌలర్ల ఆధిపత్యం చూసుకోవచ్చు. ఒట్నీల్ బార్ట్‌మన్, ఫ్రాంక్ న్సుబుగా(Frank Nsubuga), , ఆదిల్ రషీద్( Adil Rashid), ట్రెంట్ బౌల్ట్(Trent Boult), టిమ్ సౌతీ(Tim Southee), ఫెర్గూసన్, మహ్మద్ అమీర్, ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు ఓవర్లలో 20 డాట్ బాల్స్ వేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
ఇండియా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion