T20 World Cup 2024 Updates: 20 వరల్డ్ కప్‌లో గ్రూప్ B కొంచెం టఫ్ - తాజా, మాజీ ఛాంపియన్ మధ్యే ఫైట్
Eng Vs Aus In T20 World Cup 2024: ఇద్దరు ఛాంపియన్లు ఉన్న గ్రూప్‌బీలో పోటీ మామూలుగా ఉండదు. అసలే ఐపీఎల్‌లో దుమ్మురేపిన బ్యాచ్ అంతా ఇదే గ్రూప్‌లో ఉంది.
T20 World cup 2024 Group B Team: టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ B కొంచెం టఫ్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ గ్రూపులో టీ20 వరల్డ్ కప్పును గెల్చుకున్న లాస్ట్ 2 టీమ్స్ ఉన్నాయి. 2021లో టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న ఆస్ట్రేలియా 2022లో టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న ఇంగ్లండ్ ఈ రెండు జట్లు గ్రూపు Bలోనే తలపడుతున్నాయి. ఈ గ్రూపులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కాకుండా మూడు చిన్న జట్లు కూడా ఉన్నాయి. అవి నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.
1. ఇంగ్లండ్ England
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది ఇంగ్లండ్. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను ఫైనల్లో ఓడించి వరల్డ్ కప్ అందుకుంది ఇంగ్లండ్. సో ఆ కాన్ఫిడెన్స్ ఈసారి కూడా కనిపించటం ఖాయం. ప్రధానంగా కెప్టెన్ జోస్ బట్లరే వీళ్ల బలం. జానీ బెయిర్ స్టో, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, శామ్ కర్రన్, లియామ్ లివింగ్ స్టన్ వీళ్లంతా ఐపీఎల్లో తమ ఫామ్‌ను చూపించిన వాళ్లే. హ్యారీ బ్రూక్ ఎలా ఆడతాడో చూడాలి. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్‌ను నమ్ముకుంది ఇంగ్లండ్. స్పిన్ బాధ్యతలను మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చూసుకుంటారు. వీళ్లకు జూన్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచే లీగ్ దశలో పెద్ద మ్యాచ్.
2. ఆస్ట్రేలియా Australia
వరల్డ్ కప్పులు అంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం చూపించే ఆస్ట్రేలియా 2021లో టీ20 వరల్డ్ కప్పు విజేత. వన్డే వరల్డ్ కప్పుల మాదిరిగానే టీ20 వరల్డ్ కప్పుల్లోనూ డామినెన్స్ చూపించాలంటే ఆస్ట్రేలియా ఈ ఎడిషన్ గెలవాల్సిందే. ఎందుకంటే టీ20ల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి సార్లు వరల్డ్ కప్పులు గెలిస్తే.. ఆస్ట్రేలియా ఒక్కసారే గెలిచింది. మిచ్ మార్ష్ కెప్టెన్సీ చేస్తున్న ఈ వరల్డ్ కప్పులో ట్రావియెస్ హెడ్ కీలక ఆటగాడు. డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కేమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మ్యాథ్యూ వేడ్, స్టాయినిస్ బ్యాటింగ్ లైనప్‌లో బలమైన ఆటగాళ్లు. బౌలింగ్‌లో మిచె స్టార్క్, మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హేజిల్ వుడ్ పేస్ అటాక్‌ను ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలను చూసుకుంటారు. వీళ్లకు కూడా జూన్ 8న జరిగే ఇంగ్లడ్ మ్యాచే కీలకం.
3. నమీబియా Namibia
టీ20 వరల్డ్ కప్పులో ప్రమాదకరమైన చిన్న జట్లలో నమీబియా కూడా ఒకటి. జింబాబ్వే లాంటి టీమ్‌కి వరల్డ్ కప్ ఛాన్స్ దక్కకుండా వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ఆఫ్రికా లీగ్ విజేతగా నిలిచి టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టింది నమీబియా. లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన ఘనత కూడా నమీబియాకు ఉంది. గెర్ హార్డ్ ఎరాస్మస్ ఈ డేంజరస్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
4. ఒమన్ Oman
ఈ గ్రూపులో ఉన్న ఏకైక ఆసియా జట్టు ఒమన్. మూడోసారి టీ20 వరల్డ్ కప్పు ఆడుతున్న ఒమన్ మనం ఇందాక డేంజరస్ టీమ్ అని చెప్పుకున్న నమీబియాను వరల్డ్ కప్పుల్లో రెండుసార్లు ఓడించింది. ఈ రెండు టీమ్స్‌కి మధ్య మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. అకీబ్ ఇలియాస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు ఈ టీమ్‌కి.
5. స్కాట్లాండ్ Scotland
రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్కాట్లాండ్ టీమ్‌లో ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. మార్క్ వాట్ ఈ టీమ్‌లో చూడదగిన ఆటగాడు. 2018లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఈ టీమ్‌ను తక్కువ అంచనా వేయటానికి లేదు.