Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ VS కామనర్స్- విమర్శలుపాలవుతున్న సీజన్ 9
Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్ బాస్‌లో కామనర్స్ వర్సెస్ బిగ్‌బాస్ అనేలా మారిపోయింది. ఇందులో కావాలనే అందరు వారిని టార్గెట్ చేస్తూ బయటకు పంపించేస్తున్నారని అంటున్నారు.

Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్‌బాస్ మొదలై నెలరోజులు దాటింది. సీజన్‌లో దమ్ము లేదని బంధాలతో ఫ్యామిలీ సీరియస్ చూసినట్టు ఉందని చాలా మంది విమర్శలు చేశారు. అయితే ఒక్క ఎలిమినేషన్ మాత్రం ఏ సీజన్‌కు రాని ఎలివేషన్ తీసుకొచ్చింది. బిగ్‌బాస్‌కు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరూ రాకపోవడంతో ఈసారి భిన్నంగా ప్లాన్ చేశారు. ఎక్కువ మంది కామనర్స్‌ను పంపించాలని ముందుగానే అగ్ని పరీక్ష అనే సరికొత్త కార్యక్రమాన్ని పెట్టారు. అందులో సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయిన వాళ్లను తీసుకొచ్చారు. వారిలో ఆరుగురిని పంపించారు. వారితోపాటు సెలబ్రిటీలను కూడా పంపించారు. ఇప్పటి వరకు ముగ్గురు కామనర్స్ ఒక సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు వైల్డ్ కార్డు పేరుతో మరికొందరు సెలబ్రిటీలను హౌస్‌లోకి తీసుకొచ్చారు.
సీజన్9లో ఇంత మంది కామనర్స్ ఉండటం అదే స్థాయిలో సెలబ్రిటీలు ఉండటంతో పోటీ ఆసక్తిగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సీజన్ ప్రారంభం నుంచే చాలా పేలవంగా సాగింది. వెళ్లిన వాళ్లెవరూ ఆటపై, ఎంటర్‌టైన్‌మెంట్‌పై దృష్టి పెట్టకుండా విహారయాత్రకు వెళ్లినట్టు ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఇలా సాగుతున్న టైంలో బిగ్‌బాస్ తీసుకున్న నిర్ణయాలు హోస్ట్ నాగార్జునతో ఇప్పిస్తున్న సలహాలు మాత్రం కామనర్స్‌ను టార్గెట్ చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మొదట్లో కామనర్స్ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది నిజమే. కానీ వారికి ఇచ్చిన సలహాలను సీరియస్‌గా తీసుకొని ఫోకస్డ్‌గా ఆడుతున్నారు. అలాంటి టైంలో వారిని మరింతగా వారి ఆటను దెబ్బతీసేలా ఉన్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే కామనర్స్‌ను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే గత వారం రోజుల ఆట చూస్తే టాప్‌లో తనూజ తర్వాత పవన్ కల్యాణ్, సంజన, శ్రీజ టాప్‌లో ఉన్నారు. మిగతా ఆటగాళ్లు ఒకటి అర శాతం ఓట్ల తేడాతో చివరి స్థానంలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీలు ఉన్నారు. అందుకే వారిని సేవ్ చేయడానికి వారం రోజులుగా బిగ్ బాస్ టీం చాలా కష్టపడింది. అన్నట్టుగానే వారి అనుకున్న సెలబ్రిటీలు అంతా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.
ఆదివారం నాడు జరిగిన ఎలిమినేషన్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. కావాలనే సుమన్ శెట్టి లాంటి వాళ్లను బయటకు పంపించలేక శ్రీజను పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. వైల్డ్ కార్డు పేరుతో వచ్చిన వాళ్లను కూడా బిగ్ బాస్ ఆ దిశగానే గైడ్ చేశారనే అనిపిస్తోంది. ఆమెను బయటకు పంపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో అందరికీ బాగా తెలిసింది. ఇప్పటి వరకు హౌస్ నుంచి నలుగురు కామనర్స్ వెళ్లిపోయారు. కానీ వారిలో ముగ్గురు ప్రజలు ఓట్లు వేయకపోవడంతోనే వెళ్లిపోయారు. అయితే శ్రీజను మాత్రమే వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన వాళ్లతో ఎలిమినేట్ చేయించారు. ఇదే తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఇది ఒకటే కాదు హోస్ట్ నాగార్జునుతో కూడా బిగ్‌బాస్ టీం తప్పులు చేయిస్తోంది. గేమ్‌ను రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తున్న వారిని సరైన దారిలో పెట్టేందుకు పీకే క్లాస్ కేవలం కామనర్స్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో షో కోసం వచ్చిన ఆడియన్స్ గట్టిగానే సెలబ్రిటీల ఆట తీరును తప్పుపట్టారు. సీజన్ మొదలైనప్పటి నుంచి భరణి అనే వ్యక్తి కేవలం బంధాలు పెంచుకొని ఆట గురించి పట్టించుకోవడం లేదు. తనకు డబ్బా కొట్టే వాళ్లనే ప్రోత్సహిస్తూ వేరే వాళ్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. దీన్నే అక్కడికి వచ్చిన ఆడియన్స్ గట్టిగా చెప్పారు. కానీ దీన్ని మాత్రం నాగార్జున కానీ, బిగ్ బాస్ టీంను కానీ అడ్రస్ చేయలేకపోయారు. ఇంట్లో సంజనా లాంటి వ్యక్తి పదేే పదే చోరీలు చేస్తూ అందర్ని ఇబ్బంది పెడుతున్నా గట్టిగా మాట్లాడింది లేదు. సున్నితంగా మాట్లాడి వదిలేశారు.
డేంజర్ జోన్ నుంచి బయటపడేందుకు నిర్వహించిన ఓ గేమ్‌లో ఓడిపోయిన తర్వాత రీతుపై పవన్ అసహనం వ్యక్తం చేస్తాడు. దాన్ని హోస్ట్ నాగార్జున తప్పుపట్టారు. మాడు మొహం వేసుకొని ఏంటదని క్లాస్ తీసుకున్నారు. ఓడిపోతే అలా తిడతావా అంటూ క్లాస్ తీసుకున్నారు. కానీ ఆ గేమ్ సిరీస్‌లోనే పవన్ కల్యాణ్‌ను తనూజ అన్న మాటలు మాత్రం కన్వినెంట్‌గా బిగ్‌బాస్ టీం మర్చిపోయింది. రీతు తప్పు చేసిందని డెమాన్ పవన్‌ను కెప్టెన్ నుంచి తప్పించారు. కానీ కల్యాణ్ చీట్ చేసి కెప్టెన్ అయ్యాడని ఆరోపిస్తున్న ఓ వీడియోను తనూజకు చూపించారు. డెమాన్ కాళ్లతో భరణి వైపు చూపించాడనే అర్థం వచ్చేలా ఉంది. కానీ అదే విషయాన్ని పవన్, కల్యాణ్ అడిగితే సరిపోయేదానికి అనవసరమైన సీన్ చేశారు. అక్కడ కూడా ఇద్దరు కామనర్స్‌ను టార్గెట్ చేసేలా స్కెచ్ వేశారు.
షో ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో ఉన్న వాళ్లు కామనర్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిగ్‌బాస్ కూడా చేస్తున్నారు. ఆదివారం వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా వారినే టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షోకు బిగ్ సెలబ్రిటీలు ఎవరూ రావడం లేదు. కాంట్రవర్సీ సెలబ్రిటీలు తప్ప వేరే వాళ్లు షోలో ఉండేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు ఇలా ఇష్టం వచ్చిన ఎలిమినేషన్స్, వారినే టార్గెట్ చేస్తూ వారిపై అబాండాలు మోపుతున్నారు. ఇది షోను దెబ్బతీస్తుందని చూసేందుకు కూడా జనాలు ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు.





















