అన్వేషించండి

T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్ - ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్న మహ్మద్ షమీ

జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనపడింది. పేసర్ మహ్మద్ షమీ పొట్టి ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Mohammed Shami clears fitness test at NCA: టీ20 ప్రపంచ కప్ 2022కు ముందే టీమిండియాకు శుభవార్త. పేసర్ మహ్మద్ షమీ పొట్టి ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనపడింది. ఈ సమయంలో కాస్త ఊరటనిచ్చే అంశం షమీ అందుబాటులోకి రావడం. నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాసైన సీనియర్ పేసర్ షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. 

ఆస్ట్రేలియాలో టీమిండియా.. 
14 మందితో కూడిన భారత జట్టు ఇదివరకే ఆస్ట్రేలియాకు వెళ్లింది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్గదర్శకత్వంలో పొట్టి ప్రపంచ కప్ సాధించేందుకు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇదివరకే పశ్చిమ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కాగా, గాయం కారణంతో స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా సైతం టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి బుమ్రాకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టనుందని సమాచారం.

బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్న షమీ ! 
బుమ్రాకు గాయం కావడంతో ఆ స్థానాన్ని సిరాజ్, దీపక్ చహర్, మహ్మద్ షమీలలో ఒకరితో భర్తీ చేసేందుకు బీసీసీఐ యోచించింది. ఈ క్రమంలో షమీ ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్ చేయడం, సీనియర్ బౌలర్ కావడంతో అతడి వైపు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తరువాత నుంచి షమీ ఇప్పటివరకూ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం కలవరపెడుతోంది. అయితే ఆస్ట్రేలియా లాంటి పిచ్ ల మీద బౌలింగ్ దాడిని నడిపించాలంటే షమీ లాంటి బౌలర్ జట్టుకు ఎంతో అవసరమని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్న షమీ.. భారత్ ఆడనున్న వార్మప్ మ్యాచ్‌లలో బౌలింగ్ చేస్తే అతడికి మరింత ప్రాక్టీస్ కానుంది.

టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ జట్టు
ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నంబర్ వన్‌గా ఉంది. ఈసారి పొట్టి ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా బలమైన పోటీదారుగా చెప్పొచ్చు. ఈ ఏడాది మొత్తం 32 టి 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఈ 32 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా 23 విజయాలు సాధించింది. 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దైంది.  గెలుపు శాతం పరంగా చూస్తే ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టు 74 శాతం మ్యాచ్‌లలో విజయం సాధించింది.

గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఐసిసి ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు ఐదో స్థానంలో  ఉంది. అయినా కేన్ విలియమ్సన్‌ నేతృత్వంలోని జట్టులో చాలా మంది టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్క క్షణంలో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా వాళ్లకు ఉంది. ఈ ఏడాది న్యూజిలాండ్ మొత్తం 10 టీ20 మ్యాచ్లు ఆడగా, అందులో తొమ్మిదింట విజయం సాధించి గెలుపు శాతం 90తో ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget