T20 World Cup 2022: వచ్చి నాకు బౌలింగ్ వేయవా - 11 సంవత్సరాల పిల్లోడిని అడిగిన రోహిత్ - ఎవరా బాలుడు?
ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ ఒక 11 సంవత్సరాల భారతీయ బాలుడిని బౌలింగ్ వేయమని కోరడం సంచలనంగా మారింది.
యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో భారత క్రికెటర్లు ఎప్పుడూ ముందుంటారు. 11 సంవత్సరాల వయసున్న ద్రుశీల్ చౌహాన్ ఏకంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేసే అవకాశాన్ని పొందాడు. నెట్‌లో రోహిత్ శర్మకు ద్రుశీల్ బౌలింగ్ చేశాడు.
టీమ్ ఇండియా వీడియో అనలిస్ట్ హరి ప్రసాద్ మోహన్ బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ కథను వివరించాడు. “మేం ప్రాక్టీస్ సెషన్ కోసం WACAకి చేరుకున్నాం. పిల్లలు వారి ఉదయం ఈవెంట్‌ను ముగించారు. మేం మా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే, 100 మంది పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడటం చూశాం. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని రోహిత్ మొదట గుర్తించాడు. అతనిని చూసిన తర్వాత ద్రుశీల్ వేసిన రెండు,మూడు బంతులు, అతని స్మూత్ రన్-అప్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను సహజంగానే ప్రతిభావంతుడు.’ అని హరి మోహన్ చెప్పారు.
“రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వెళ్లి, మరికొన్ని బంతులు వేయమని పిల్లవాడిని అడిగాడు. రోహిత్ శర్మ అతన్ని బౌలింగ్ చేయడానికి ఆహ్వానించాడు. భారత కెప్టెన్‌కి బౌలింగ్ చేయడం ఆ పిల్లవాడికి చిరస్మరణీయమైన క్షణం,” అని హరి మోహన్ అన్నారు.
ఈ సంఘటన గురించి ద్రుశీల్ మాట్లాడుతూ, “రోహిత్ శర్మ నన్ను చూసి బౌలింగ్ చేయమని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక రోజు ముందు నేను రోహిత్‌కి బౌలింగ్ చేయగలనని మా నాన్న నాకు చెప్పారు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇష్టమైన బంతి స్వింగ్ యార్కర్.’ అన్నాడు.
వారి నెట్ సెషన్ తర్వాత, రోహిత్ ద్రుశీల్‌ని ‘నువ్వు పెర్త్‌లో ఉంటావు. మరి భారత్ తరఫున ఎలా ఆడతావు?’ అని అడిగాడు. ‘నేను బాగా బౌలింగ్ వేయడం నేర్చుకున్నాక భారతదేశానికి వెళతాను." అని ద్రుశీల్ బదులిచ్చాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో ఇంటరాక్ట్ అవ్వడానికి ద్రుశీల్‌ను టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించారు.
View this post on Instagram