T20 World Cup 2022: వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే! ఏబీడీ అంచనా నిజమవుతుందా?
T20 World Cup 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమ్‌ఇండియా విజేతగా ఆవిర్భవిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంచనా వేశాడు.
T20 World Cup 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమ్‌ఇండియా విజేతగా ఆవిర్భవిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంచనా వేశాడు. సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ ఓడిస్తుందని పేర్కొన్నాడు. ఫైనల్లో కివీస్, భారత్ తలపడతాయని, హిట్‌మ్యాన్ సేన విశ్వ విజేతగా ఆవిర్భవిస్తుందని వెల్లడించాడు.
#WATCH | I think India will play New Zealand in the finals and India will win the World Cup. Suryakumar Yadav and Virat Kohli are in great form. The whole team of India is very talented: Former South African cricketer AB de Villiers pic.twitter.com/83tRjI0Fl2
— ANI (@ANI) November 8, 2022
టీ20 ప్రపంచకప్ ఆఖరి దశకు చేరిన సంగతి తెలిసిందే. బుధవారం సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ తొలి సెమీస్‌లో తలపడుతున్నాయి. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లాండ్, టీమ్‌ఇండియా రెండో సెమీస్‌లో ఢీకొంటున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో విజేతలు ఆదివారం ఫైనల్ ఆడతాయి. ఈ మ్యాచులో భారత్, కివీస్ ఆడతాయని ఏబీడీ అంచనా వేస్తున్నాడు. 'భారత్, న్యూజిలాండ్ ఫైనల్ ఆడతాయి. బహుశా టీమ్‌ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నా' అని అతడు ఏఎన్‌ఐకి తెలిపాడు.
Fan boy moment 😍❤️ pic.twitter.com/mst1CLQ8W1
— AB De Fans Trends™ (@AbdeFansTrends) November 8, 2022
భారత జట్టుపై ఏబీడీ ప్రశంసలు జల్లు కురిపించాడు. 'టీమ్‌ఇండియాలో ప్రతి ఒక్కరూ బాగా ఆడుతున్నారు. సూర్యకుమార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ ఫామ్ బాగుంది. రోహిత్ తన స్థాయికి ఆడలేదు కానీ అవసరమైనప్పుడు రెచ్చిపోతాడు. మ్యాచులు గెలిపిస్తాడు. అతడో అద్భుతమైన ఆటగాడు. మొత్తం బ్యాటింగ్ లైనప్, జట్టు తెలివైనవాళ్లే. ఇంగ్లాండ్‌పై బాగా ఆడతారని కోరుకుంటున్నా. ఇదే వారికి అసలైన పరీక్ష. సెమీస్ గెలిస్తే భారత్ ట్రోఫీని ముద్దాడినట్టే' అని ఏబీ అన్నాడు.
వాస్తవంగా ఐసీసీ టోర్నీలో కివీస్‌పై టీమ్‌ఇండియాకు మెరుగైన చరిత్ర లేదు. గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచులో కివీస్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఓటమి చవిచూసింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో అయితే బాధాకరంగా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆటగాళ్లున్న ఫామ్‌తో భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది.
View this post on Instagram