అన్వేషించండి

 Ben Stokes: ఒకప్పుడు డిప్రెషన్‌తో బాధపడ్డాడు- ఇప్పుడు జట్టుకు కప్‌ను అందించాడు

Ben Stokes: బెన్ స్టోక్స్... తండ్రి మరణంతో ఒకప్పుడు డిప్రెషన్ తో బాధపడిన ఈ ఆల్ రౌండర్ ఇప్పుడు ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Ben Stokes: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లిష్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో వెంటవెంటనే వికెట్లు పడినప్పటికీ స్టోక్స్ చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు కప్ ను అందించాడు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్ రెండేళ్ల కిందట డిప్రెషన్ తో బాధపడ్డాడట. ఈ విషయాన్ని స్టోక్సే స్వయంగా తన బయోపిక్ బెన్ స్టోక్స్ ఫీనిక్స్ ఫర్ ది యాషెస్ లో వెల్లడించారు. 

రెండేళ్ల క్రితం 2020లో బెన్ స్టోక్స్ తండ్రి చనిపోయారు. అప్పుడు ఈ ఆల్ రౌండర్ డిప్రెషన్ తో బాధపడ్డాడు. ఈ క్రమంలో క్రికెట్ కు కొంతకాలం విరామం తీసుకున్నాడు. తండ్రి దూరమైన బాధ నుంచి తేరుకోవడానికి బ్రేక్ తప్పదనిపించింది. నేను గొప్ప క్రికెటర్ గా ఎదగడంలో మా నాన్న పాత్ర చాలా ఉంది.  నా కోసం ఆయన చాలా చేశారు. అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోవడానికి నాకు సమయం పట్టింది అని స్టోక్స్ చెప్పాడు. 

విరామం అనంతరం జట్టులోకి వచ్చిన స్టోక్స్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ గా తన పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 49 బంతుల్లో 52 పరుగులు చేసి తన జట్టు ఛాంపియన్ గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇదే కాదు 2019 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్ గెలవడంలోనూ స్టోక్స్ పాత్ర చాలా ఉంది. న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ ను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. 98 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 

టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ఇంగ్లాండ్‌ ఆవిర్భవించింది. మెల్‌బోర్న్‌ వేదికగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో అద్వితీయ విజయం అందుకుంది. బంతితో మంచి పోటీనిచ్చిన పాకిస్థాన్‌ను ఓడించింది. బంతి బంతికీ పెరిగిన ఒత్తిడిని చిత్తు చేసింది. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది. ప్రత్యర్థి నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ జట్టు 5 వికెట్లు మిగిలుండగానే ఛేదించింది. 2019 వన్డే ప్రపంచకప్‌ మొనగాడు బెన్‌స్టోక్స్‌ (52; 49 బంతుల్లో 5x4, 1x6) అజేయంగా పోరాడి మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ అని నిరూపించుకున్నాడు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (26; 17 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. అంతకు ముందు పాక్‌లో బాబర్‌ ఆజామ్‌ (32; 28 బంతుల్లో 2x4), షాన్‌ మసూద్‌ (38; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Mahakali: ‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటాRatan Tata: జీవితాంతం మూగజీవాలకు సేవ చేసిన రతన్ టాటాRatan Tata News: చిన్న సంస్థల పాలిట దేవుడు, కొత్త ఐడియాలకు కొండంత అండఅపర కుబేరుడు రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Mahakali: ‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
Next Successor of Ratan Tata: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
Ratan Tata Net Worth: రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు
రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు
Vettaiyan : ‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
Share Market Opening: పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
Embed widget