Team India Squad Announced: టీ20లకు హార్దిక్. వన్డేలకు రోహిత్ నాయకత్వం- శ్రీలంకతో సిరీస్ కు భారత జట్ల ప్రకటన
Team India Squad Announced: జనవరి 2024లో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ ల కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. మొత్తం 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి.
Team India Squad Announced: జనవరి 2024లో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ ల కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. మొత్తం 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. జనవరి 3 నుంచి టీ20 సిరీస్, జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కొత్త సెలక్షన్ కమిటీ ఇంకా ఏర్పాటు కానందున చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానల్ జట్టును ప్రకటించింది.
శ్రీలంకతో టీ20 జట్టుకు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించనున్నాడు. వన్డేలకు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తాడు. అలాగే పాండ్య వన్డేలకు వైస్ కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. శివమ్ మావి, ముఖేష్ కుమార్ లు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ ను ఏ జట్టుకూ ఎంపికచేయలేదు. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా ఏ సిరీస్ కు ఎంపికవలేదు. గాయం నుంచి ఇంకా కోలుకోనందున రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ ను తీసుకోలేదు.
శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు
హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్హదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022
శ్రీలంకతో వన్డే సిరీస్ కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్హదీప్ సింగ్.
#TeamIndia squad for three-match ODI series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/XlilZYQWX2
— BCCI (@BCCI) December 27, 2022
Team India calling 🥳🥳💫!!
— 𝑪𝑺𝑲 𝑳𝒐𝒚𝒂𝒍 𝑭𝑪 🥳 (@CSK_Zealots) December 27, 2022
Ruturaj Gaikwad is picked up for Ind vs SL tour 💫🤩!!@Ruutu1331 | #Whistlepodu | #YelLove pic.twitter.com/GC7P93dxvc