Twins in IPL 2023: ఉప్పల్‌లో అన్నదమ్ముల సవాల్ - జాన్‌సెన్ బ్రదర్స్ జగడానికి సర్వం సిద్ధం!
SRH vs MI: ఐపీఎల్-16 లో మంగళవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రాధాన్యత ఉంది.
Twins in IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు (ఏప్రిల్ 18) సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) - ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య జరుగబోయే మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ అన్నదమ్ముల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు సాక్ష్యం కానున్నది. దక్షిణాఫ్రికా కవలలు మార్కో జాన్‌సెన్ - డువాన్ జాన్‌సెన్‌లు నేడు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకోబోతున్నారు. ఈ సీజన్‌లో అన్నదమ్ముల మధ్య జరుగబోయే తొలి మ్యాచ్ ఇదే.
మార్కో జాన్‌సెన్ సన్ రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా డువాన్ ముంబైకి ఆడుతున్నాడు. మార్కో 2021 నుంచే ఐపీఎల్ లో ఆడుతుండగా డువాన్ మాత్రం ఈ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖెడేలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముంబై ఆడిన మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ‘హలో బ్రదర్’లు ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఎస్ఆర్‌హెచ్ - ఎంఐ తుది జట్లలో ఈ ఇద్దరూ ఉండి ఒకరు బ్యాటింగ్ చేస్తుండగా మరొకరు బౌలింగ్ చేస్తుంటే అప్పుడుంటది అసలు మజా..
జాన్‌సెన్ బ్రదర్స్ ఇద్దరూ పేసర్లే. మార్కో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. అయితే డువాన్ బౌలింగ్ ఒక్కటి మాత్రమే ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పరిచయం. ఈ ఇద్దరూ కలిసే ఆడారు గానీ ఇంతవరకూ ప్రత్యర్థుల టీమ్‌లలో ఆడలేదని డువాన్ ముంబై ఇండియన్స్ విడుదల చేసిన వీడియోలో చెప్పాడు. ఈ ఇద్దరి సమరానికి ఉప్పల్ వేదిక కానుంది. యాధృశ్చికమో ఏమో గానీ మార్కో జాన్‌సెన్ కూడా ముందుగా ముంబైకి ఆడినవాడే. 2021 సీజన్ లో మార్కో.. ముంబై తరఫున 2 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత 2022 సీజన్ లో అతడిని హైదరాబాద్ దక్కించుకుంది. ఇప్పుడు అతడి సోదరుడు డువాన్ ముంబైకే ఆడుతుండటం గమనార్హం.
Arey bhai bhai bhai 😋🫶 👉 https://t.co/gwvL4xqg8O
— Mumbai Indians (@mipaltan) April 18, 2023
Duan on the twin challenge of playing in the IPL and facing off against Marco today. 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 #SRHvMI pic.twitter.com/30TsD7NdOl
మ్యాచ్ ముచ్చట్లు..
ఇక నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో హైదరాబాద్ - ముంబైలు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 10 సార్లు గెలవగా హైదరాబాద్ 9 మ్యాచ్‌లలో నెగ్గింది. ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 3, ముంబై 4 సార్లు జయకేతనం ఎగురేసింది. ఐపీఎల్‌లో ఈ జట్లు గత ఐదు మ్యాచ్‌లలో తలపడ్డ సందర్భాల్లో ఎస్ఆర్‌హెచ్ రెండుసార్లు నెగ్గగా ఎంఐ మూడింట్లో విజయాలు సాధించింది. 2022లో జరిగిన ఏకైక మ్యాచ్‌ను హైదరాబాదే గెలుచుకుంది.
Captain Ro Hyderabad వచ్చెసాడు! 💙#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/LbDgfbrV19
— Mumbai Indians (@mipaltan) April 17, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.