Shubman Gill: విరాట్ కోహ్లీని దాటిన 'కెప్టెన్ గిల్', ఒక ఇన్నింగ్స్ హీరోని చేసింది
Shubman Gill: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో గిల్ శతకంతో కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ మంచి టార్గెట్‌ను ఇంగ్లండ్ టీంకు ఇచ్చింది.

Shubman Gill: లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తన టెస్ట్ కెప్టెన్సీని గ్రాండ్‌గా ప్రారంభించాడు. యంగ్ అండ్ డైనమిక్ భారత జట్టుకు నాయకత్వం వహించిన గిల్, ప్రశాంతంగా సెంచరీ కొట్టేశాడు. శుభ్‌మన్ గిల్ ఈ సెంచరీతో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా గిల్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఇది, ఇందులో సెంచరీ సాధించడం ద్వారా అతను టీమ్ ఇండియాలో నమ్మకాన్ని పెంచాడు. ఇప్పుడు గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో విరాట్ కోహ్లీని అధిగమించాడు. అయితే రోహిత్ శర్మకు మాత్రం చాలా దూరంలో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయుల జాబితాలో గిల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు.
గిల్ కెప్టెన్ నాక్
గిల్ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించి, కేవలం 56 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత అతను జోరు పెంచుకుంటూ 142 బంతుల్లోనే ఇంగ్లీష్ గడ్డపై తన తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 బౌండరీలు ఉన్నాయి.
WTC 2019లో ప్రారంభమైంది, ఆ తర్వాత విరాట్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో మొత్తం 5 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో, గిల్ ఇప్పుడు WTCలో 6 సెంచరీలు సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయ ఆటగాడు రోహిత్ శర్మ, అతను 9 సార్లు సెంచరీలు సాధించాడు. గిల్ వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. అతను రోహిత్‌ను కూడా సులభంగా అధిగమించి WTC లో చారిత్రాత్మక రికార్డును తన పేరు మీద రాసుకునే ఛాన్స్ ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన విషయంలో యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచాడు. జైస్వాల్ ఇప్పటివరకు 5 సెంచరీలు సాధించాడు, అదే సమయంలో రిషబ్ పంత్ కూడా ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టు ఉన్నాడు. ఇప్పటివరకు WTCలో అతని బ్యాట్ నుంచి 4 సెంచరీలు వచ్చాయి.
టెస్ట్ కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన భారతీయులు:
164* – విజయ్ హజారే vs ఇంగ్లాండ్, ఢిల్లీ, 1951
116 – సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1976
115 – విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 2014
147 – శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్, హెడింగ్లీ, 2025
టెస్ట్ కెప్టెన్‌గా అరంగేట్రంలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు
టెస్ట్ కెప్టెన్‌గా అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన తొమ్మిదవ భారతీయుడు, అతి పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. కేవలం 25 సంవత్సరాల 285 రోజుల వయసులో, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గిల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనతకు తోడు, గిల్ తన టెస్ట్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు, నాయకుడిగా తన దూకుడు ప్రదర్శించాడు.
23 ఏళ్ల తర్వాత హెడింగ్లీలో అరుదైన ఫీట్
ఈ సెంచరీతో లీడ్స్‌లో టెస్ట్ సెంచరీ సాధించిన భారత కెప్టెన్ల ఎలైట్ జాబితాలో గిల్ చేరాడు. ఈ ఘనత సాధించిన చివరి భారత కెప్టెన్ 2002లో సౌరవ్ గంగూలీ కాగా, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 1967లో ఈ ఘనత సాధించాడు.
శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు
శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా, శుభ్‌మన్ గిల్ 2,000 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు. దీనితోపాటు, కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 5వ భారతీయ కెప్టెన్‌గా కూడా నిలిచాడు. అదే మ్యాచ్‌లో అతను టెస్ట్‌లో తన వ్యక్తిగతంగా అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు. అతను 56 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.




















