అన్వేషించండి
Advertisement
BCCI: బీసీసీఐ హెచ్చరికలతో, దేశవాళీలో స్టార్ క్రికెటర్లు
BCCI: బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్, కిషన్ ఎట్టకేలకు దారికొచ్చారు. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్ ఆడనుండగా ఇషాన్ తాజాగా డీవై పాటిల్ టీ20 కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
Shreyas Iyer and Ishan Kishan: ఐపీఎల్(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్ కిషన్( Ishan Kishan), శ్రేయస్స్ అయ్యర్(Shreyas Iyer)... ఐపీఎల్ ఆడేందుకు మాత్రం సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని ఇషాన్, వెన్నునొప్పితో రంజీ ఆడని ఆయ్యర్‌పై బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంగా ఉంది. దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు.
దారికొచ్చిన అయ్యర్, కిషన్
బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్, కిషన్ ఎట్టకేలకు దారికొచ్చారు. సెమీస్‌లో భాగంగా ముంబై.. తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్.. రంజీ సెమీస్ ఆడనున్నట్టు తెలుస్తోంది. మార్చి మూడు నుంచి జరుగబోయే రంజీ సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్ తెలిపినట్లు తెలుస్తోంది. అయ్యర్‌తో పాటు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా స్వల్ప విరామం తర్వాత క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. నవంబర్‌లో ఆసిస్‌తో టీ20 సిరీస్ ఆడిన తర్వాత కిషన్ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాడు. బరోడాలో హార్ధిక్ పాండ్యాతో కలిసి కిరణ్ మోరే అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న ఇషాన్.. తాజాగా డీవై పాటిల్ టీ20 కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీ తర్వాత ఇషాన్.. నేరుగా ఐపీఎల్ ఆడనున్నాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో మహాద్భుతం
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంంట్ రంజీ ట్రోఫీలో అద్భుతం ఆవిష్కృతం అయింది. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే ఘటన జరిగింది. రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు చారిత్రక ప్రదర్శన చేశారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై 10, 11వ నంబర్ ఆటగాళ్లు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్ కోటియన్ 129 బంతుల్లో 120 నాటౌట్... 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్ దేశ్‌పాండే 129 బంతుల్లో 123 పరుగులతో సెంచరీలు చేసి చరిత్రపుటల్లోకెక్కారు. వీరిద్దరు కలిసి పదో వికెట్‌కు 249 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. రంజీ ట్రోఫీ చరిత్రలో 10, 11వ నంబర్ బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి. భారత క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. 1946లో సర్రే జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన 10, 11వ నంబర్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. ఆ మ్యాచ్‌లో భారత టెయిలెండర్లు షుటే బెనర్జీ, చందు సర్వతే సెంచరీలు సాధించగా.. ఇప్పుడు ముంబై టెయిలెండర్లు తనుశ్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. తనుశ్ -తుషార్ జోడీ శతకాల మోత మోగించడంతో బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion