అన్వేషించండి

Babar Azam: టీ 20 క్రికెట్‌కు బాబర్‌ పనికిరాడు, మరోసారి కెప్టెన్‌పై వేటేనా?

Babar Azam: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశకు చేరుకోకపోవడంతో కెప్టెన్ బాబర్ ఆజంపైవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన దేశ మాజీ ఆటగాళ్ళే కాదు ఇతర దేశాల వెటరన్‌లు ఘాటుగా విమర్శిస్తున్నారు.

Kris Srikkanth on Babar Azam: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో పాకిస్థాన్(Pakistan) లీగ్‌ దశలోనే వెనుదిరగడంపై విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. పాక్‌ ఓటమికి కెప్టెన్‌ బాబర్‌ ఆజమే కారణమని ఆ దేశ అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. భారత మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్( Kris Srikkanth) కూడా బాబర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజం 122 అంతర్జాతీయ టీ 20 మ్యాచుల్లో కేవలం 4113 పరుగులే చేశాడని క్రిష్‌ గుర్తు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో బాబర్‌ మరింత ఘోరంగా విఫలమవుతున్నాడని... దానికి అతని గణాంకాలే నిదర్శనమని శ్రీకాంత్‌ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ ఈవెంట్‌లలో 16 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ కేవలం 517 పరుగులు మాత్రమే చేశాడని క్రిష్‌ అన్నాడు. 112 స్ట్రైక్ రేట్‌తో కేవలం 517 పరుగులు మాత్రమే చేయడం అతని పేలవ ప్రదర్శనకు నిదర్శనమని విమర్శించాడు. బాబర్ ఆజంను ఇంకా టీ 20 క్రికెట్‌లో కొనసాగించడం కరెక్ట్ కాదని. జిడ్డు బ్యాటింగ్‌ ఈ పొట్టి క్రికెట్‌లో పనికిరాదని క్రిష్‌ అన్నాడు.  122 టీ 20 మ్యాచుల్లో బాబర్ ఆజం 40.72 సగటుతో 4113 పరుగులు చేశాడు. ఇందులో అతను మూడు సెంచరీలు చేశాడు. 
 
కెప్టెన్సీ కష్టమే
2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వైఫల్యంపై విమర్శలు చెలరేగుతున్న వేళ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బాబర్‌ ఆజమ్‌ను మరోసారి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత బాబర్‌పై వేటు పడింది. ఆ తర్వాత కూడా వరుస ఓటములు వెంటాడడంతో పాక్‌ కెప్టెన్‌పై వేటు పడింది. ఇప్పుడు మరోసారి టీ 20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో బాబర్‌పై కత్తి వేలాడుతోంది. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించవచ్చని తెలుస్తోంది. షాహీన్ అఫ్రిదీని మళ్లీ కెప్టెన్‌గా చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇదే తొలిసారి కాదు...
టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌ వంటి అగ్రశ్రేణి జట్లు లీగ్‌ దశలోనే వెనుదిరగడం క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఈ పెద్ద జట్లను ఓడించి పసికూనలుగా భావించిన జట్లు సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించి ఔరా అనిపించాయి. పాక్‌, లంక, కివీస్‌ జట్లు సూపర్‌ ఎయిట్‌ చేరడం ఖాయమని... టైటిల్ రేసులోనూ ఈ జట్లు ఉన్నాయని చాలామంది అంచనా వేశారు. అయితే టీ 20 ప్రపంచకప్‌లో గతంలోనూ అగ్రశ్రేణి జట్లు లీగ్‌ దశలోనే వెనుదిరిగిన చరిత్ర ఉంది.  2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, సౌతాఫ్రికా లీగ్‌ దశలోనే వెనుదిరుగుతున్నాయి. పొట్టి ప్రపంచకప్ 2014లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget