IND vs PAK: పాక్‌కు షాక్! తలకు బంతి తగిలి మైదానంలో కూలబడ్డ మసూద్ - డగౌట్లో భయం భయం
Shan Masood Injured: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచుకు ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్! ఆ జట్టు ఆటగాడు షాన్ మసూద్ తీవ్రంగా గాయపడ్డాడు.
Shan Masood Injured: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచుకు ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్! ఆ జట్టు ఆటగాడు షాన్ మసూద్ తీవ్రంగా గాయపడ్డాడు. టీమ్‌ఇండియా మ్యాచ్ కోసం నెట్స్‌లో సాధన చేస్తుండగా అతడి తలకు బంతి తగిలింది. నొప్పితో విలవిల్లాడిన అతడు అక్కడే కూలబడ్డాడు. వెంటనే జట్టు సభ్యులంతా అతడి వద్దకు చేరుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Pakistan Squad Update
— Grassroots Cricket (@grassrootscric) October 21, 2022
Shan Masood has been taken to hospital for scans after being hit on the head by a ball during Pakistan's net session.#T20WorldCup pic.twitter.com/pkN4w6Ppbu
పాకిస్థాన్ ఆదివారం తొలి మ్యాచ్ ఆడనుంది. మెల్‌బోర్న్ వేదికగా టీమ్‌ఇండియాతో తలపడనుంది. ఈ మ్యాచు కోసం జట్టంతా శుక్రవారం ఎంసీజీలో ప్రాక్టీస్ చేసింది. షాన్ మసూద్, మహ్మద్ నవాజ్ ఎదురెదురు నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్నారు. అదే సమయంలో బౌలర్ విసిరిన బౌన్సర్‌ను నవాజ్ భారీ షాట్ ఆడాడు. అతడు కొట్టిన బంతి నేరుగా వచ్చి షాన్ మసూద్ తల కుడివైపు తగిలింది. దిమ్మతిరగడంతో అతడు కాసేపు అక్కడే కూలబడిపోయాడు. కిందపడటంతో ఫిజియోలతో పాటు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ సహా ఆటగాళ్లంతా అతడి వద్దకు చేరుకున్నారు.
A moment of extreme scare. Mohammad Nawaz is distraught and down on the ground after his shot hits Shan Masood flash at the back of his neck😳
— Srinjoy Sanyal (@srinjoysanyal07) October 21, 2022
Watch this exclusive footage on @Sportskeeda. #T20WorldCup #INDvsPAK pic.twitter.com/9JrhGQ0ZSg
గాయం తీవ్రత తెలియకపోవడంతో ఆందోళనకు గురైన మసూద్ మైదానం వీడాడు. కాసేపటి తర్వాత అతడిని మెల్‌బోర్న్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్ చేయిస్తున్నారు. దాంట్లో వచ్చే ఫలితాన్ని బట్టి అతడి భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఇప్పటికైతే టీమ్‌ఇండియాతో మ్యాచులో ఆడడని సమాచారం. పాక్ మిడిలార్డర్లో మసూద్ కీలకమని తెలిసింది. 'ఎంసీజీ నెట్స్‌లో సాధన చేస్తుండగా షాన్ మసూద్ తల కుడివైపు బంతి తగిలింది. ముందు జాగ్రత్తగా స్కాన్ తీయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు' అని పీబీసీ ప్రకటించింది.
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజామ్, షాబాద్ ఖాన్, అసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలి, హ్యారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, కుష్‌దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీమ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్
స్టాండ్‌బై ఆటగాళ్లు : ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హ్యారిస్, షహనాజ్ దహానీ
Training session in Melbourne ✅🏏🔛#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/5m5XlKttdW
— Pakistan Cricket (@TheRealPCB) October 21, 2022