Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడిన పాక్ యువ బౌలర్ షహీన్
Shaheen Afridi Marriage: పాకిస్థాన్ యువ సంచలన బౌలర్ షహీన్ షా అఫ్రిది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను షహీన్ వివాహమాడాడు.
Shaheen Afridi Marriage: పాకిస్థాన్ యువ సంచలన బౌలర్ షహీన్ షా అఫ్రిది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను షహీన్ వివాహమాడాడు. నిన్న (ఫిబ్రవరి 3) వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పాక్ క్రికెట్ జట్టు సభ్యులు వీరి పెళ్లికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది రెండో కుమార్తె అన్షా. ఆమె వైద్య విదార్థి. 22 ఏళ్ల యువ బౌలర్ షహీన్, అన్షా ప్రేమలో ఉన్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో షహీన్ తన ప్రేమను బయటపెట్టాడు. పెద్దల అంగీకారంతో గతేడాది వీరిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు. తాజాగా తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు.
The 𝐌𝐞𝐧 𝐢𝐧 𝐆𝐫𝐞𝐞𝐧 reunited at Shaheen's 𝐍𝐢𝐤𝐤𝐚𝐡😍#PakistanCricket #ShaheenShahAfridi pic.twitter.com/4L85rTiwfk
— Cricket Pakistan (@cricketpakcompk) February 3, 2023
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, నసీమ్ షా, షాదాబ్ ఖాన్ సహా పలువురు క్రికెటర్లు వీరి విహహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షహీన్ కు శుభాకంక్షలు తెలిపారు. షహీన్ త్వరలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్ లో అతడు లాహోర్ ఖలాండర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ లీగ్ ముగిశాక ఇతర వేడుకలు జరగనున్నట్లు సమాచారం.
"Qabool Hai, Qabool Hai"#NewBeginings #ShaheenShahAfridi pic.twitter.com/4kiswYI0iG
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
Prayers for you my baby brother @iShaheenAfridi. May you and your wife be the source of happiness and joy for each other, Ameen. #ShaheenShahAfridi pic.twitter.com/VL7Wp7x6uR
— Muhammad Rizwan (@iMRizwanPak) February 3, 2023
Players Reaction on Shaheen Shah Afridi's Nikkah#MainHoonQalandar #DilSe pic.twitter.com/hPR2IDTUFX
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

