అన్వేషించండి

Sania Mirza and Shoaib Malik Divorced: విడిపోయిన సానియా జంట! పాక్‌ నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్‌

Sania Mirza and Shoaib Malik News:అనుమానాలను నిజం చేస్తూ... స్టార్‌ కపుల్‌ సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ జోడీ విడిపోయింది. కొన్నేళ్లుగా షికార్లు చేస్తున్న పుకార్లు నిజమేనని రుజువైంది.

Sania Mirza and Shoaib Malik News:అనుమానాలను నిజం చేస్తూ... స్టార్‌ కపుల్‌ సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ జోడీ విడిపోయింది. కొన్నేళ్లుగా షికార్లు చేస్తున్న పుకార్లు నిజమేనని రుజువైంది. సానియాతో 14 ఏళ్ల పెళ్లి బంధానికి షోయబ్‌ వీడ్కోలు పలికాడు. సానియా మీర్జాతో విడిపోతున్నట్లు వచ్చిన వార్తలను వాస్తవమేనని రుజువు చేస్తూ... పాక్‌  క్రికెటర్‌ షోయబ్ మాలిక్.. నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. నటి సనా జావెద్‌తో ఉన్న ఫొటోలను షోయబ్‌ మాలిక్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గత ఏడాది సనా జావెద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత షోయబ్‌ మాలిక్... సనా జావెద్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇటు షోయబ్‌ మాలిక్‌ కానీ... అటు సనా కానీ ఎవరూ ఖండించలేదు. అప్పటినుంచే షోయబ్‌ మాలిక్‌- సానియా విడిపోతున్నట్లు  వార్తలు వచ్చాయి. తనకు చాలా కాలంగా సనా జావేద్ తెలుసని.. ఆమెతో చాలాసార్లు పని చేసే అవకాశం వచ్చిందని... సనా తన పక్కనున్న వ్యక్తులతో చాలా దయగా మర్యాదగా ఉంటుందని షోయబ్‌ మాలిక్‌ తెలిపాడు. 
 
సానియా వేదాంతంతో అనుమానాలకు బలం
" వివాహం చేసుకోవడం కష్టం. విడాకులు తీసుకోవడం ఇంకా కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి" అంటూ సానియా షేర్‌ చేసిన ఇన్‌ స్టా స్టోరీతో మళ్లీ విడాకుల గురించి చర్చ మొదలైంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మీరు చేసుకునే ఎంపికను బట్టి జీవితం ఉంటుందంటూ సానియా ఆ పోస్ట్‌లో షేర్‌ చేసింది. సానియా షేర్‌ చేసిన ఈ స్టోరీ క్షణాల్లో వైరల్‌గా మారింది. భర్త షోయబ్‌ మాలిక్‌తో సానియా విడిపోతోందని... అందుకే ఇలా పోస్ట్‌ చేసిందన్న ఊహాగానాలు చెలరేగాయి. 
 
2010లో ప్రేమ వివాహం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో షోయబ్ మాలిక్ సైతం ట్విటర్ అకౌంట్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా నేమ్‌ను తీసేశాడు. తాజాగా సానియా తన ఇన్‌స్టా నుంచి షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో సానియా- షోయబ్‌ త్వరలోనే డివోర్స్ తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.
 
గతంలోనూ...
సానియా మీర్జా -షోయబ్ మాలిక్‌‌ సంసార జీవితం గురించి అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. భర్త షోయబ్ మాలిక్‌తో సానియా విడిపోయిందని.. వీరి మధ్య అంత సఖ్యత లేదనే పుకార్లు సోషల్ మీడియాలో చాలాకాలంగా వైరల్ అవుతున్నాయి. సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే ఈ పుకార్లపై వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడింది లేదు. సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించింది. అటు షోయబ్ మాలిక్‌ సైతం ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమంటూ నెటిజన్లు అప్పట్లో వార్తలు చెలరేగాయి. ఈ జంట ఒకరి గురించి ఒకరు పోస్ట్ చేసి చాలా కాలం అయ్యింది. దాంతో ఈ జంట విడాకుల ఊహాగానాలను మరింత పెంచినట్టైంది. ఇప్పుడు ఈ ఊహాగానాలే నిజమయ్యాయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
Laila Teaser: మాస్‌ కా దాస్‌ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ - లైలా టీజర్‌ చూశారా?
మాస్‌ కా దాస్‌ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ - లైలా టీజర్‌ చూశారా?
Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
Laila Teaser: మాస్‌ కా దాస్‌ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ - లైలా టీజర్‌ చూశారా?
మాస్‌ కా దాస్‌ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ - లైలా టీజర్‌ చూశారా?
Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
Chandrababu About NTR: సమతావాది, సంస్కర్త ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుక్షణం పనిచేస్తాం: చంద్రబాబు ఘన నివాళి
సమతావాది, సంస్కర్త ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుక్షణం పనిచేస్తాం: చంద్రబాబు ఘన నివాళి
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం
BCCI 10 Points Guidelines: పది పాయింట్ల గైడ్ లైన్లపై భజ్జీ ఫైర్.. చర్చను పక్కదారి పట్టించొద్దని బోర్డుకు చురకలు
పది పాయింట్ల గైడ్ లైన్లపై భజ్జీ ఫైర్.. చర్చను పక్కదారి పట్టించొద్దని బోర్డుకు చురకలు
Electrical Vehicle Park: కర్నూలు జిల్లాలో ఎలక్ట్రికల్ వెహికల్ పార్కు, దేశంలోనే తొలి ప్రైవేట్ ఈవీ పార్కుగా ఘనత
కర్నూలు జిల్లాలో ఎలక్ట్రికల్ వెహికల్ పార్కు, ఏపీ ప్రభుత్వంతో పీపుల్ టెక్ సంస్థ ఒప్పందం- దేశంలోనే తొలి ప్రైవేట్ ఈవీ పార్కు
Embed widget