అన్వేషించండి

ASIA CUP : ఒక్క అడుగు! పాక్‌ మ్యాచుతో రోహిత్‌ రికార్డు బుక్‌లోకి మరో ఘనత!

ఆసియా కప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచేందుకు రోహిత్ ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ.. మరో మ్యాచ్ ఆడితే టాప్ లోకి వెళ్తాడు.

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆసియా కప్ నకు సిద్ధమైంది. టైటిల్ ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో  ఆడే మ్యాచ్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వ్యక్తిగత రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ లో 27 మ్యాచులు ఆడిన రోహిత్.. మరో మ్యాచ్ ఆడితే ఆసియా కప్ లో అత్యధిక గేమ్ లు ఆడిన శ్రీలంక వెటరన్ బ్యాట్స్ మెన్ మహేలా జయవర్దనేను అధిగమిస్తాడు. ఆగస్టు 28న పాకిస్థాన్ తో జరిగే ఆసియాకప్ మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనత అందుకోనున్నాడు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయుడిగా  రోహిత్ ఉన్నాడు. 2008లో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్.. మొత్తం ఇప్పటివరకూ ఈ టోర్నమెంట్ లో 883 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 7 అర్ధ శతకాలు ఉన్నాయి.

శ్రీలంక మాజీ బ్యాట్స్ మెన్ మహేల జయవర్ధనే ఆసియా కప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 28 మ్యాచ్ లు ఆడిన అతను.. 29.30 సగటుతో 674 పరుగులు చేశాడు. జయవర్దనే 2000లో ఆసియా కప్ లో అరంగేట్రం చేశాడు.

ఆసియాకప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన షాహిద్ అఫ్రిది రెండో స్థానంలో నిలిచారు. 1997లో అఫ్రిది తన మొదటి మ్యాచ్ ఆడగా.. 2016లో చివరి మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్ వికెట్ కీపర్,  బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీమ్ 26 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక వెటరన్ బ్యాటర్ సనత జయసూర్య, బంగ్లా బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా 25 మ్యాచ్ లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అరవింద డిసిల్వా 24 మ్యాచ్ లతో సంయుక్తంగా ఐదో స్థానాన్ని ఆక్రమించారు. 

ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ ఏడాది జరగబోతున్నది 15వ ఎడిషన్.  మొత్తం ఆరు జట్లు ఆసియా కప్ 2022లో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు టోర్నీకి నేరుగా ఎంపికయ్యాయి. మరో జట్టును క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. 

ఆసియా కప్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

టాప్ హెడ్ లైన్స్

Rohit Virat WorldCup: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందేనని బోర్డు కీలక నిర్ణయం
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందేనని బోర్డు కీలక నిర్ణయం
Rishabh Pant Sixes:  దిగ్గజం మెకల్లమ్  రికార్డును బద్దలు కొట్టిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు, గిల్‌క్రిస్ట్ సరసన ..
దిగ్గజం మెకల్లమ్  రికార్డును బద్దలు కొట్టిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు, గిల్‌క్రిస్ట్ సరసన నిలిచిన టీమిండియా కీపర్
Team India World Record: 149 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా.. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు
149 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా.. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు
Chahal Politics: బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget