2024 T20 World Cup Final Memory: టెన్షన్ తో బిగ్ స్క్రీన్ వైపు చూడలేదు.. సూర్య అది చెప్పాకే ధైర్యమొచ్చింది.. టీ20 వరల్డ్ కప్ మిల్లర్ క్యాచ్ పై రోహిత్ స్పందన..
సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ప్రపంచకప్ విన్నర్ గా నిలిచింది.మధ్యలో 2012లో ఫైనల్ కు చేరినా, శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. అయితే రోహిత్ కెప్టెన్సీలో 17 ఏళ్ల తర్వాత విజేతగా భారత్ నిలిచింది.

Rohit Sharma Comments: గతేడాది సరిగ్గా ఇదే రోజు (జూన్ 29) న టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కేవలం ఏడు పరుగులతో ఫస్ట్ టైం ఫైనలిస్టు సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ప్రపంచకప్ చాంపియన్ గా నిలిచింది. దీంతో ఈ కప్పును రెండుసార్లు సాధించిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ సరసన నిలిచింది. ఇక ఆ మ్యాచ్ ఫైనల్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అప్పటి భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సూర్య పట్టిన క్యాచ్ గురించి ముఖ్యంగా మాట్లాడాడు. 20వ ఓవర్ తొలి బంతిని డేవిడ్ మిల్లర్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద రిలే క్యాచ్ ను సూర్య అందుకున్నాడు. దీనిపై థర్డ్ అంపైర్ ని సంప్రదించగా, ఫలితం కోసం చాలా నెర్వస్ గా ఎదురు చూసినట్లు రోహిత్ తెలిపాడు.
The raw emotions from Rohit Sharma, Virat Kohli & Team India after finally ending the 11-year ICC trophy drought. 🏆🇮🇳❤️#RohitSharma𓃵 #ViratKohli𓃵 #T20WorldCup2024 #TeamIndia pic.twitter.com/VdnoWzmuPT
— Akaran.A (@Akaran_1) June 29, 2025
స్క్రీన్ వైపు చూడలేదు..
నిజానికి మిల్లర్ షాట్ కొట్టిన విధానంతో బంతి బౌండరీ ఆవతల పడిందని, సిక్సర్ అయిందని తను భావించినట్లు రోహిత్ తెలిపాడు. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా, ఈ బంతి సిక్సర్ అయిపోవడంతో ఐదు బంతుల్లో 11 పరుగులు సౌతాఫ్రికా చేయాల్సి ఉందని మానసికంగా ఫిక్సయినట్లు పేర్కొన్నాడు. అయితే అనూహ్యంగా సూర్య క్యాచ్ పట్టడంతో దాన్ని థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. దీంతో టెన్షన్ తో తన స్క్రీన్ వైపు చూడకుండా, క్యాచ్ ఫెయిరా కాదా..? అని సూర్యను ఆరా తీసినట్లు పేర్కొన్నాడు. సూర్య మాత్రం కాన్పిడెంట్ గా అది క్యాచ్ అని తెలపడంతో ఉత్కంఠతో స్కీన్ వైపు చూసినట్లు తెలిపాడు.
కాన్ఫిండెంట్ గా..
సూర్య మాటలతో కాన్ఫిడెంట్ పెరిగి, తాన స్క్రీన్ వైపు చూశానని, క్యాచ్ పట్టిన తర్వాత సూర్య కాలు బౌండరీ లైన్ కు తాకలేదని ఫిక్స్ కావడంతో ఆనందం కలిగిందని రోహిత చెప్పుకొచ్చాడు. నిజానికి స్టేడియంలో ఆ సమయంలో వ్యతిరేక దిశలో గాలి వీస్తుండటంతో బంతి బౌండరీ లైన్ వద్దకు వచ్చిందని, సూర్య దాన్ని ఒరుపుగా అందుకున్నాడని ప్రశంసించాడు. ఆ తర్వాత ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి, టీ20 ప్రపంచ చాంపియన్ గా భారత్ నిలిచింది. దీంతో ఈ ఫార్మాట్ లో భారత్ కు కప్పు అందించిన ఎంఎస్ ధోనీ తర్వాత రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఏడాదే రోహిత్ కెప్టెన్సీ లో భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించి, మరోసారి విజేతగా నిలిచింది. దీంతో రెండు ఐసీసీ టోర్నీలు సాధించిన రెండో భారత కెప్టెన్ గా ధోనీ తర్వాత స్థానంలో నిలిచాడు.




















