Rohit Sharma: రోహిత్ శర్మ చేతిలో చిక్కుకున్న హార్దిక్ పాండ్య.. చెప్పింది చేయడం తప్ప ఇంకో దిక్కు లేదు..!
Rohit Sharma Vs Hardik Pandya: రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్య సిరీస్‌లో మరో ఎపిసోడ్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఇప్పుడు రోహిత్ చేతిలోనే పాండ్య భవిష్యత్ ఉందనే టాక్ నడుస్తోంది.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎప్పుడూ చూడనంత ఆఫ్ ద ఫీల్డ్ మసాలా ఈ సీజన్ లభిస్తోంది. ఆ మసాలా పేరు రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్య. వారిద్దరి మధ్యా అంతా బానే ఉందో తెలియదు కానీ బయట మాత్రం ఇది ఇంకా హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది.కెప్టెన్ గా ఉన్న హార్దిక్... సీనియర్ ప్లేయర్ రోహిత్ ను గౌరవించట్లేదని, యాటిట్యూడ్ చూపిస్తున్నాడని చాలామంది ఆరోపిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా హార్దిక్ పై గట్టిగానే ట్రోలింగ్ కు దిగుతున్నారు.
ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం..... రోహిత్ శర్మ చెప్పినట్టు హార్దిక్ పాండ్య చేసి తీరాల్సిందే. అలాంటి సిట్యుయేషన్ లో ఉన్నాడు. జూన్ లో టీ20 ప్రపంచకప్ ఉంది కదా. అందులో హార్దిక్ సెలెక్ట్ కావాలంటే ఐపీఎల్ లో రెగ్యులర్ గా బౌలింగ్ చేస్తుండాలని... భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టెర్ల ప్యానెల్ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయించారట.
ఇప్పుడు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్... రోహిత్ ను లీడ్ చేస్తున్నా... రెండు నెలల తర్వాత రోల్స్ రివర్స్ అవడం ఖాయం. ఇక హార్దిక్ బౌలింగ్ విషయానికి వస్తే.... ఈ సీజన్ లో అంత రెగ్యులర్ గా బౌలింగ్ చేయట్లేదు. ఓ మ్యాచ్ బౌలింగ్ చేస్తుంటే, రెండు మ్యాచులు అసలు ఆ జోలికే వెళ్లట్లేదు. ఈ వైఖరే చాలా అనుమానాలకు తావిస్తోంది. ఏమైనా గాయాన్ని దాస్తున్నాడా అని ప్రశ్నలు కూడా తలెత్తాయి.
బౌలింగ్ వేయలేని స్థితిలో ఉంటే హార్దిక్ ఇండియాకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మునపటిలా హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. అదే సమయంలో.... శివం దూబే, రింకూ సింగ్ లాంటి కుర్రాళ్లు తమ హిట్టింగ్ తో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే సగం సీజన్ అయిపోయిన నేపథ్యంలో.... మిగతా సగంలో హార్దిక్ హిట్టింగ్ రేంజ్ పెంచడమే కాదు.... బౌలింగ్ లో కూడా సత్తా చాటాల్సిన పరిస్థితి నెలకొంది.