కోల్‌కతా చేతి గుంజుకున్న బట్లర్‌



రాజస్థాన్ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో మిరాకిల్



విజయాన్ని కోల్‌కతా చేతిలోంచి లాగేసిన జోస్ బట్లర్



మిగతా బ్యాటర్‌ల మద్దతు లేకపోయినా జట్టును గెలిపించిన హీరో



మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా సునీల్‌ నరైన్‌ సెంచరీతో 223 పరుగులు చేసింది.



విధ్వంసమైన బ్యాటింగ్‌తో నరైన్‌ 49 బంతుల్లో సెంచరీ చేశాడు.



సునీల్‌ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 109 పరుగులు చేసి అవుటయ్యాడు



224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఎక్కడా విజయం దిశగా ఆడలేదు.



125 పరుగులకే రాజస్థాన్‌ ఆరు వికెట్లు కోల్పోయింది.



రాజస్థాన్ ఓటమి ఖాయమనుకున్న వేళ జోస్‌ బట్లర్‌ ఒంటి చేత్తో గెలిపించాడు



బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్ లు, 6 సిక్సర్ లతో 107 పరుగులతో క్రీజ్‌లో నిలచిన జట్టును గెలిపించాడు.