అన్వేషించండి

Duleep Trophy: అనంతపురానికి రోహిత్‌, కోహ్లీ, దేశవాళీ క్రికెట్​కు కొత్త జోష్ !

Indian Team: దేశవాళీ క్రికెట్‌లో భారత అగ్రశ్రేణి క్రికెటర్ల ఆట జోష్ పెంచబోతోంది. అంతే కాదు ఈ టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించటంతో తెలుగు ఫాన్స్ మరింత జోష్ మీదున్నారు.

Indian Players In Duleep Trophy 2024: సాధారణంగా  సిరీస్‌ల మధ్య ఎక్కువ  గ్యాప్ వస్తూ ఉంటే ఫిట్‌నెస్, ఫామ్‌ కోసం క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. ఎవరో కొంతమంది స్టార్ క్రికెటర్లకు మాత్రమే  అందులో పాల్గొనకుండా   వెసులుబాటు  దక్కుతుంది. అయితే ఇంతకు ముందు బిసిసిఐ(BCCI) చీఫ్ జై షా(Jai Shah) అన్న మాటల ప్రభావమో , ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir) వచ్చిన ఫలితమో గానీ  టీమ్ఇండియా  కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బరిలో దిగనున్నారు. 

భారత జట్టు ఇటీవల శ్రీలంక(Sri lanka)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడింది. దీని తర్వాత బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే శ్రీలంక సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్‌ మధ్యలో  దాదాపు 40 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్‌లో, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీతో సహా చాలా మంది భారతీయ స్టార్లు దేశీయ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2024 ఆడటం చూడవచ్చు. నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి. 

దీనిబట్టి  రోహిత్ శర్మ దాదాపు 9ఏళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో ఆడనున్నాడు.  అయితే రోహిత్, కోహ్లీలు సాధారణ  జట్ల సభ్యులుగా ఉంటారా, లేదా  కెప్టెన్లుగా బరిలో దిగుతారా అన్నదానిపై  క్లారిటీ లేదు. రవీంద్ర జడేజా,  శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ను దులీప్ ట్రోఫీలో ఆడనుండగా,  స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం.

ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించారు. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి చెందిన స్టేడియం.. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.  సెప్టెంబర్ 5వ తేదీన దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరుగనుంది.  ఈ ట్రోఫీ  22వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా మూడు వారాల పాటు జాతీయ జట్టు క్రికెటర్లు అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. మొదటి రౌండ్ లో లేకపోయినా సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న టోర్నీ రెండో రౌండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడటం చూడవచ్చు.  అయితే ఇప్పుడు ఈ లొకేషన్  మార్చనున్నట్టు  కూడా సమాచారం.  క్రిక్‌బజ్‌లో వచ్చిన కథనం ప్రకారం, వేదికలో మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడికి అంతర్జాతీయ విమానాలకు అవకాశం లేకపోవటం కారణం కావచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అయితే  టోర్నీలో ఒక రౌండ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు.

 అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్‌ ట్రోఫీ కోసం నాలుగు జట్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఇండియా ఎ,  బి,   సి,  డి జట్లలో టీమిండియా స్టార్స్ ఆడనున్నారు. దులీప్‌ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.  

Also Read: Paris Olympics 2024: భారత్‌కు ఆ ఏడు పతకాలు వచ్చుంటే, వెంట్రుకవాసిలో చేజారిన పతకాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget