అన్వేషించండి

WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

WPL 2026 Final:కెప్టెన్ స్మృతి మంధాన వీరోచిత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి రెండోసారి WPL టైటిల్‌ను ఆర్సీబీ ఎగరేసుకుపోయింది

WPL 2026 Final: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ ముగింపు అద్భుతమైన మలుపులతో, ఉత్కంఠభరిత పోరాటంతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. వడోదర వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన వీరోచిత ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రం మరోసారి ఫైనల్ గండం తప్పలేదు. 


WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ - భారీ స్కోరుతో సవాల్ 

ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరును చేసింది. ఫైనల్ ఒత్తిడిని ఏమాత్రం లెక్కచేయకుండా మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడింది. 204 పరుగుల లక్ష్యం అంటే మహిళా క్రికెట్‌లో అది కూడా ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత కష్టతరమైందిగా భావించారు. అయితే, బెంగళూరు బౌలర్లు మధ్యలో కొన్ని వికెట్లు తీసి కట్టడి చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి స్కోరు బోర్డు పరుగులు తీసింది.


WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

మంధాన మెరుపులు.. ఆర్సీబీ రికార్డు ఛేజింగ్ 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మంధాన కేవలం 87 పరుగులు చేసి జట్టును విజయపు ముంగిట నిలిపారు. ఆమెకు తోడుగా జార్జియా వేర్‌హామ్, ఇతర బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.


WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

చివరి ఓవర్ల వరకు మ్యాచ్ ఊగిసలాడింది. 19వ ఓవర్లో సెట్ బ్యాటర్ స్మృతి మంధాన అవుట్ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో బెంగళూరుకు గెలుపు కోసం చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఒత్తిడిలో కూడా బెంగళూరు బ్యాటర్లు సంయమనం కోల్పోకుండా ఆడి, 19.4 ఓవర్లలోనే 204/4 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు.


WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగోసారి కూడా రన్నరప్‌గానే

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది ఒక పీడకలలా మిగిలిపోయింది. మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా నాలుగు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా ఢిల్లీ రికార్డు సృష్టించింది. కానీ, దురదృష్టవశాత్తు ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ ఓటమి పాలై రన్నరప్‌కే పరిమితమైంది. ఇది ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. లీగ్ స్టేజ్‌లో అద్భుతంగా ఆడి, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరిన ఢిల్లీ, చివరి మెట్టుపై బోల్తా పడింది.


WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు ఆర్సీబీ ప్రస్థానం 

ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆర్సీబీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 విజయాలు  నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్సీబీ, లీగ్ దశలో ఢిల్లీ, ముంబై చేతుల్లో ఓడిపోయింది. ఫైనల్‌లో మాత్రం ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకుంది. గతంలో 2023-24 సీజన్లో తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ, ఇప్పుడు 2026లో రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.


WPL 2026 ఫైనల్‌లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్‌తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!

టాప్ హెడ్ లైన్స్

India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget