అన్వేషించండి

Ranji Trophy: కెప్టెన్సీకి విహారి రాజీనామా అదే కారణమా?

Hanuma Vihari: టీమిండియా టెస్టు జట్టు ఆటగాడు గాదె హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర రంజీ జట్ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు.

టీమిండియా(Team India) టెస్టు జట్టు ఆటగాడు గాదె హనుమ విహారి(Hanuma Vihari) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర రంజీ జట్ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. ట్రోఫీలో భాగంగా శుక్రవారం ముంబై(Mumbi)తో మ్యాచ్‌కు ముందు విహారి కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు హనుమ విహారి ప్రకటించాడు. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విహారి కెప్టెన్‌గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్‌ నుంచి రికీ భుయ్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. శుక్రవారం ముంబైతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలీట్‌ గ్రూపు-బి మ్యాచ్‌లో సీనియర్‌ బ్యాటర్‌ రిక్కీ భుయ్‌ ఆంధ్ర సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 
 
మెరుగ్గా ముంబై
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఓపెనర్లు జయ్‌ బిస్తా (39), భూపేన్‌ లాల్వాని (61) జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్‌ ఆజింక్య రహానె (0) విఫలమైనా.. సువేద్‌ పార్కర్‌ (41), శ్రేయస్‌ అయ్యర్‌ (48) జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆంధ్ర బౌలర్లలో నితీశ్‌కుమార్‌రెడ్డి (3/44), షోయబ్‌ఖాన్‌ (2/42), లలిత్‌ మోహన్‌ (1/67) సఫలమయ్యారు. రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్‌లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు.  గత మ్యాచ్‌కు దూరమై ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన సీనియర్‌ ప్లేయర్‌ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ గోల్డెన్‌ డక్‌ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.
 
ఈ వార్తలు నిజమేనా...?
ఆంధ్ర జట్టు తరఫున విహారి 30 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. ప్లేయర్‌గా కూడా సత్తాచాటాడు. 53 సగటుతో 2,262 పరుగులు స్కోర్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆంధ్ర బ్యాటర్లలో విహారి కూడా ఒకడు. అయితే హైదరాబాద్ మూలాలున్న కారణంగా హనుమ విహారి కొన్ని విషయాల్లో ఆంధ్ర జట్టులో బయటి ఆటగాడిగా కనిపిస్తున్నాడని 'క్రిక్‌బజ్' తెలిపింది. అయితే ఆంధ్ర క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఆర్‌వీసీహెచ్ ప్రసాద్ మాత్రం విహారి తనంతట తానుగా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడని.. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని వెల్లడించారు. "బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించేందుకు విహారి కాస్త విరామం తీసుకోవాలనుకున్నాడు. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విహారిని తప్పించాలని ఎలాంటి ఒత్తిడి లేదు" అని ప్రసాద్ తెలిపారు. 
 
టీమిండియాలో ఇలా....
2018లో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన విహారి... ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టు ఓడిపోయే స్థితిలో విహారి వీరోచిత పోరాటం చేశాడు. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 111. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు.

టాప్ హెడ్ లైన్స్

Shami Snub Drama: భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి..
భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి, రవిశాస్త్రి సంచలన కామెంట్స్
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Gambhir Setup Flaw: ఓటములకు గంభీర్ వ్యూహమే కారణం.. గవాస్కర్ సంచలన విశ్లేషణ, హార్దిక్ కోసం వెతుకులాటపై ఘాటు వ్యాఖ్యలు
ఓటములకు గంభీర్ వ్యూహమే కారణం.. గవాస్కర్ సంచలన విశ్లేషణ, హార్దిక్ కోసం వెతుకులాటపై ఘాటు వ్యాఖ్యలు
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget