Rahul Dravid Corona: టీమిండియాక్ షాక్.. ద్రవిడ్ కు కరోనా
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డారు. ఈరోజు చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. మరో 4 రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వార్త ఆందోళన కలిగించే విషయమే.
ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు చేదు వార్త. భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డారు. ఈనెల 27 నుంచి యూఏఈలో ఆసియా కప్ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం ప్రారంభ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడే సంగతి తెలిసిందే.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కొవిడ్ వస్తే ఐదు రోజులు క్వారంటైన్లో ఉంటే చాలు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఓ రెండు వారాల పాటు ద్రవిడ్‌కు విశ్రాంతిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆసియా కప్‌నకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఉండటం దాదాపుగా ఖాయమే! ఇప్పటికే ఐర్లాండ్, జింబాబ్వే ఇతర సిరీసులకు ఆయన కోచ్‌గా పనిచేశారు. గతంలో బెంగాల్ రంజీ జట్టుకు బ్యాటింగ్ సలహాదారు, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా కాలం బ్రేక్ తర్వాత ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు. జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ చివరిగా మైదానంలోకి దిగాడు. ఆసియా కప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నారు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
బుమ్రా, హర్షల్ పటేల్ దూరం
భారత పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఆసియా కప్ 2022 సెలక్షన్‌కు అందుబాటులో లేరు. వీరు ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లు స్టాండ్ బైగా ఉన్నారు.
వెన్నెముక గాయంతో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడు. తన గాయం తగ్గడానికి మరింత సమయం పట్టనుందని తెలుస్తోంది. ‘జస్‌ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం అయ్యాడు. తను జట్టులో ప్రధాన బౌలర్. కాబట్టి టీ20 వరల్డ్ కప్ లోపే తను కోలుకోవాలని కోరుకుంటున్నాం.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
మొత్తం ఆరు జట్లు ఆసియా కప్ 2022లో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు టోర్నీకి నేరుగా ఎంపికయ్యాయి. మరో జట్టును క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు.
ఆసియా కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
Congratulations to #TeamIndia on clinching the #ZIMvIND ODI series 3️⃣-0️⃣ 👏👏💥 pic.twitter.com/hGQlJxHqqJ
— BCCI (@BCCI) August 22, 2022