అన్వేషించండి
Advertisement
Ind vs Ban: భారత్-బంగ్లా మ్యాచ్‌కు వర్షం ముప్పు?
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జరిగే మ్యాచ్‌కు పూర్తిగా వాతావరణం అనుకూలంగా ఉంటుందని వెల్లడించింది.
India vs Bangladesh: ప్రపంచకప్( ICC Cricket World Cup 2023)లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా( India) మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. మహా సంగ్రామంలో బంగ్లాదేశ్(Bangladesh)ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉంది. సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో రోహిత్(Rohit Sharma) సేన అలసత్యానికి చోటివ్వకుండా గెలవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే భారత్-బంగ్లా తలపడే పుణే(Pune)లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు వరుణుకు కాస్త అడ్డుపడడంతో భారత్-బంగ్లా మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడుతాడా అన్న ఆందోళన అభిమానులను వేదిస్తోంది. అసలు ఇప్పుడు పుణేలోవాతవరణం ఎలా ఉందంటే..
బ్యాటర్లకు స్వర్గధామం....
ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశం పూర్తిగా లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జరిగే మ్యాచ్‌కు పూర్తిగా వాతావరణం అనుకూలంగా ఉంటుందని వెల్లడించింది. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం దాదాపుగా లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. టాస్ సమయంలో పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని తెలిపిది. పుణెలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. మ్యాచ్‌కు అంతరాయం కలిగించే వర్షం వచ్చే అవకాశం లేదు. పుణెలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేయడం ఉత్తమ ఎంపిక. ఇదే వేదికపై జరిగిన గత ఏడు మ్యాచుల్లో అది స్పష్టమైంది. ఆ ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో, మొదటి ఇన్నింగ్స్ స్కోరు 300 దాటింది. రెండుసార్లు మాత్రమే ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది.
అలసత్వానికి చోటివ్వకుండా...
ఎలాంటి అలసత్వానికి చోటివ్వకుండా భారత్.. బంగ్లాదేశ్‌పై బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా... శుభ్‌మన్ గిల్(Shubman Gill), విరాట్ కోహ్లీ(Virat Kohli) భారీ స్కోర్లపై కన్నేశారు. రోహిత్ గత రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై 86, అఫ్ఘానిస్తాన్(Afghanistan)పై 131 పరుగులతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అదే ఫామ్ కొనసాగి రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే బంగ్లాపై గెలుపు ఏకపక్షంగా మారవచ్చు. డెంగీ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ పెద్ద స్కోర్‌ను చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ ఏడాది గిల్ వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై 85 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అఫ్ఘానిస్థాన్‌పైనా అజేయంగా 55 పరుగులు చేశాడు.
పాకిస్థాన్(Pakistan)పై శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అజేయ అర్ధ శతకంతో సహా కె.ఎల్. రాహుల్(KL Rahul) మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు బ్యాటింగ్‌లో తిరుగులేని విధంగా ఉంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ సేన ప్రణఆళిక రచిస్తోంది. వన్డేల్లో ఈ వేదికపై ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచుల్లో గెలిచి.. మూడింట్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియాను కేవలం 199 పరుగులకే, పాకిస్థాన్‌ను 191 పరుగులకే పరిమితం చేసి భారత బౌలర్లు టాప్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ టీమిండియా అద్భుతాలు చేస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion