అన్వేషించండి

PAK vs SA: పాకిస్థాన్‌కు చావో రేవో, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో నిలిచి గెలుస్తారా?

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌కు పాకిస్థాన్‌ సిద్ధమైంది. చెన్నై చెపాక్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న డూ ఆర్‌ డై మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనుంది.

ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌కు పాకిస్థాన్‌ సిద్ధమైంది. చెన్నై చెపాక్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న డూ ఆర్‌ డై మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి సర్వత్రా విమర్శలు కురుస్తున్న వేళ.. మహా సంగ్రామంలో ఉన్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాక్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్‌ సెమీఫైనల్‌ అవకాశాలు పూర్తిగా గల్లంతవుతాయి. ఇప్పటికే పాక్‌ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే దాయాది జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్‌ చేరకుండా ప్రపంచకప్‌లో పాక్‌ పోరాటం ముగుస్తుంది. 
 
ఓడితే బాబర్‌పై వేటు తప్పదు?
ఈ ప్రపంచకప్‌లో విధ్వంసం సృష్టిస్తున్న బలమైన దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి పాలైతే బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రొటీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే మిగిలిన మ్యాచుల్లో గెలిచినా పాక్‌కు ప్రయోజనం ఉండదు. ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది ఉత్తమ ప్రయోజనమో ఆ కఠి నిర్ణయాలను పాక్‌ క్రికెట్‌ బోర్డు తీసుకుంటుందని ఇప్పటికే పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. కానీ ఈ ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు మెరుగ్గా రాణిస్తుందన్న నమ్మకం తమకు ఉందని వెల్లడించారు. వరుస ఓటములతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్‌ గెలిస్తేనే పాక్‌కు సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయలేమన్న నినాదం ఉంది. తమదైన రోజున ఎంత పటిష్టమైన జట్టునైనా పాక్‌ ఓడించగలుగుతుంది.  కాబట్టి దాయాది జట్టు వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌ చేరే అవకాశం కూడా ఉంది. 
 
బాబర్‌ ఆజమ్‌ రాణిస్తాడా..?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో సారధి బాబర్‌ ఆజమ్‌ రాణించాలని పాకిస్తాన్  కోరుకుంటోంది. పాక్‌ బ్యాటర్లు పర్వాలేదనిపిస్తున్నా బౌలర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. బౌలింగ్‌లో షాహీన్ షా అఫ్రిది అంచనాల మేర రాణించలేక పోతున్నారు. హారిస్ రౌఫ్, హసన్ అలీ బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు చిత్తు చేస్తున్నారు. స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్‌ పిచ్‌లో పాకిస్థాన్‌కు నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం అతిపెద్ద బలహీనత. లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్‌ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మీర్‌ ఎకానమీ రేటు 8 కంటే ఎక్కువగా ఉంది. 
 
ప్రొటీస్‌ విధ్వంసాన్ని ఆపుతారా..?
ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భీకర ఫామ్‌లో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. డి కాక్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. పేసర్లు కగిసో రబడా, జాన్సెన్ మరియు గెరాల్డ్ కోయెట్జీ  మెరుగ్గా రాణిస్తున్నారు. చెపాక్ పిచ్‌పై ప్రొటీస్‌ బౌలర్లను ఎదుర్కోవడం పాకిస్తాన్ బ్యాటర్లకు చాలా కష్టమైన పనే. కేశవ్ మహారాజ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. వన్డేలో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా- పాక్‌ 82 మ్యాచ్‌లు ఆడగా 51 మ్యాచుల్లో ప్రొటీస్‌.. .30 మ్యాచుల్లో పాక్‌ గెలిచింది. ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓటమి తప్ప.... మిగిలిన మ్యాచ్‌ల్లో ప్రొటీస్‌ విధ్వంసం కొనసాగింది. క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్‌, ఐడెన్ మాక్రమ్‌ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 155 ఫోర్లు, 59 సిక్సర్లు కొడితే.. పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు, 136 బౌండరీలు మాత్రమే చేయగలిగింది. మొదటి సఫారీ జట్టులో డి కాక్, క్లాసెన్, మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ 100కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తుండగా పాక్‌ బ్యాటర్లు మూడంకెల స్ట్రైక్ రేట్‌ను చేరుకోలేకపోయారు. ప్రతి పోరులోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న పాకిస్థానీలతో పోలిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉన్నారు. 
 
పాకిస్థాన్ జట్టు: 
బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్. 
 
దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, ఐడెన్ మాక్రమ్‌, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, కగిసో రబాడా, షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Embed widget