PAK vs NZ Semi-final: పాత పిచ్‌లో సెమీస్ - పాక్‌పై టాస్ గెలిచిన కివీస్!
PAK vs NZ Semi-final: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 తొలి సెమీస్‌కు వేళైంది! సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
PAK vs NZ Semi-final: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 తొలి సెమీస్‌కు వేళైంది! సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఉపయోగించిన పిచ్ కావడం, పచ్చిక ఎక్కువగా లేకపోవడంతో ఛేదనకు మొగ్గు చూపడం లేదని కేన్ విలియమ్సన్ అన్నాడు. పరిస్థితులకు అలవాటుపడటం కీలకమని పేర్కొన్నాడు. ఆట, పరిస్థితులపై దృష్టి సారించడమే తమవరకు ముఖ్యమని వివరించాడు.
New Zealand have opted to bat against Pakistan in semi-final 1 at the SCG 🏏
— T20 World Cup (@T20WorldCup) November 9, 2022
Who are you cheering for?#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/7EuauryZFX pic.twitter.com/Zrrr3VZsRc
టాస్ గెలవడం తమ చేతుల్లో లేదని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. జట్టులో మార్పులేమీ చేయడం లేదన్నాడు. ట్రైయాంగులర్ సిరీసులో తాము గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నాడు. కివీస్‌లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని, పరిస్థితులను బట్టి ఆడతామని వెల్లడించాడు. తాము చివరి రెండు ఫైనళ్లు ఆడలేదని, ప్రస్తుతానికి మ్యాచ్‌పై ఫోకస్ చేస్తున్నామని తెలిపాడు.
తుది జట్లు
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డరైల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్, మహ్మద్ హ్యారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, నసీమ్ షా, హ్యారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది
కివీస్ కేక!
గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్ల సమష్టి ప్రదర్శనతో విజయాలు సాధించింది. సూపర్- 12 తొలి మ్యాచులోనే డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది కివీస్. భారీ తేడాతో ఆ జట్టుపై గెలిచి మెరుగైన రన్ రేట్ సాధించింది. ఇప్పటివరకు పొట్టి కప్పులో సెంచరీలు సాధించిన బ్యాటరల్లో ఒకరు కివీస్ నుంచే ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్ శతకం బాదగా.. డెవాన్ కాన్వే ఆ మార్కుకు దగ్గరగా వచ్చాడు. తాజాగా కెప్టెన్ విలియమ్సన్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఐష్ సోధి, లూకీ ఫెర్గూసన్ లాంటి వారితో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. అయితే నాకౌట్ మ్యాచులు కివీస్ కు కలిసిరావు. గత వన్డే ప్రపంచకప్ లో ఫైనల్ కు వెళ్లినప్పటికీ.. అదృష్టం కలసిరాక ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయ్యింది.
పాక్‌తో డేంజర్
తొలి రెండు మ్యాచులు ఓడిన పాకిస్థాన్ సెమీస్ కు చేరుకోవడం అదృష్టమనే చెప్పాలి. భారత్, జింబాబ్వేలపై ఓడిన పాక్ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచులు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా ఓడిపోవడం ఆ జట్టుకు కలిసొచ్చింది. పాక్ బ్యాటింగ్ బలం ఆ జట్టు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజాం. అయితే ఈ ప్రపంచకప్ లో వారిద్దరూ అంచనాలను అందుకోలేదు. మిడిలార్డర్ రాణించటంతో విజయాలు అందుకుంది. షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ వంటి వారు నిలకడగా రాణిస్తున్నారు. ఆ జట్టు ప్రధాన బౌలర్ షహీన్ అఫ్రిదీ బంగ్లాదేశ్ తో మ్యాచుతో పూర్తిగా ఫాంలోకి రావడం సానుకూలాంశం. హారిస్ రవూఫ్, నసీం షా వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
ముఖాముఖి
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో పాక్ దే పైచేయి. మొత్తం 28 మ్యాచుల్లో పాక్ 17 గెలిచింది. ప్రపంచకప్ టోర్నీల్లో తలపడిన ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించింది.