అన్వేషించండి

PAK vs NZ: పాక్‌ నిలుస్తుందా! కివీస్‌ గెలుస్తుందా? పాక్‌- న్యూజిలాండ్‌ మహా సంగ్రామం

ODI World Cup 2023:  ప్రపంచకప్‌లో పాకిస్థాన్ నిలుస్తుందా... న్యూజిలాండ్‌ చివరి నాలుగు జట్లలో ఒకటిగా నిలుస్తుందా లేదా... వీటన్నింటిని ఒక్క మ్యాచ్‌తో సమాధానం దొరకనుంది.

 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ నిలుస్తుందా... న్యూజిలాండ్‌ చివరి నాలుగు జట్లలో ఒకటిగా నిలుస్తుందా లేదా... వీటన్నింటిని ఒక్క మ్యాచ్‌తో సమాధానం దొరకనుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌.. అయిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో కివీస్‌ నాలుగో స్థానంలో ఉండగా..అన్నే మ్యాచులు అడిన పాకిస్థాన్‌ మూడు విజయాలు, నాలుగు పరాజయాలతో అయిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లు ఓడితే పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు పూర్తిగా అంతమవుతాయి. ఒకవేళ న్యూజిలాండ్ ఓడితే సెమీస్‌లో నాలుగో బెర్తు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. మిగిలిన రెండు సెమీస్‌ బెర్తులు కీలకంగా మారిన వేళ ఏ జట్టు నిలుస్తుందో.. ఏ జట్టు ఆశలు ముగుస్తాయే ఈ మ్యాచ్‌తో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
కివీస్‌కు గాయాల బెడద
ఈ ప్రపంచకప్‌ను ఘనంగా ప్రారంభించిన కివీస్... వరుసగా మూడు ఓటములతో డీలా పడింది. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు పరాజయాలు కివీస్ సెమీస్‌ అవకాశాలను ప్రభావితం చేశాయి. ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. జేమ్స్ నీషమ్, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, ఫెర్గూసన్‌ ఇప్పటికే గాయాలబారిన పడగా తాజాగా మాట్ హెన్రీ గాయం కారణంగా వైదొలగడంతో ఆ జట్టు మరింత బలహీనపడింది. ఏడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసిన హెన్రీ దూరమవ్వడం కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. హెన్రీ  స్థానంలో కైల్ జామీసన్‌ను తుది జట్టులోకి రానున్నాడు. అయితే  విలియమ్సన్, నీషమ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. లాకీ ఫెర్గూసన్‌పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఆస్ట్రేలియా 388 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికాపై 357 పరుగులు చేసింది. ఈసారి బౌలింగ్‌లో రాణించాలని కివీస్‌ పట్టుదలగా ఉంది. చిన్నస్వామి స్టేడియం స్పిన్నర్లకు అనుకూలమన్న వార్తలతో శాంట్నర్‌ కూడా ప్రభావవంతమైన పాత్ర పోషించనున్నాడు. ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్‌ రాణిస్తే పాక్‌కు తిప్పలు తప్పవు. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ భారీ స్కోర్లు చేస్తే కివీస్‌కు ఎదురుండదు. ఈ టోర్నమెంట్‌లో రచిన్‌ రవీంద్ర ఏడు మ్యాచ్‌లలో 69.16 సగటుతో 415 పరుగులు చేశాడు. టామ్ లాథమ్, విల్ యంగ్ కూడా రాణిస్తే కివీస్‌కు తిరుగుండదు.
 
పాక్ గెలవాల్సిందే
ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌తో పాటు ఇంగ్లండ్‌పై కూడా గెలిస్తేనే పాక్‌కు నాకౌట్‌ అవకాశాలు ఉంటాయి. లేకపోతే పాక్‌ వెనుదిరగక తప్పదు. బంగ్లాదేశ్‌పై ఎనిమిది వికెట్లతో విజయం సాధించిన పాక్‌ కివీస్‌పై కూడా ఘన విజయం సాధించి రన్‌రేట్‌ పెంచుకోవాలని చూస్తోంది. మూడు అర్ధ సెంచరీలు చేసినా కెప్టెన్ బాబర్‌ ఆజం నుంచి పాక్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్‌పై పాక్‌ జట్టు ఆశలు పెట్టుకుంది. గాయం నుంచి కోలుకుని బంగ్లాదేశ్‌పై 81 పరుగులు చేసిన ఓపెనర్ ఫఖర్ జమాన్‌పైనా పాక్‌ జట్టు గంపెడాశలతో ఉంది. షాహీన్ షా అఫ్రిది తన అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మరో సీమర్‌ మహ్మద్ వాసిమ్ కూడా బంగ్లాదేశ్‌పై రాణించడంతో పాక్‌ ఊపిరి పీల్చుకుంది. 
 
న్యూజిలాండ్ జట్టు: 
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్, కైల్ జేమీసన్. 
 
పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలతNagababau on Pithapuram | గీతకు కాల్ చేసిన కడప వ్యక్తి..వార్నింగ్ ఇచ్చిన నాగబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
IPL 2024: గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget