By: ABP Desam | Updated at : 30 Apr 2023 04:30 PM (IST)
ఫకర్ జమాన్ (ఫైల్ ఫొటో)
Fakhar Zaman Record: పాకిస్థాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ ఈ రోజుల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతని బ్యాట్ వరుస సెంచరీలు నమోదు చేసింది. రెండో మ్యాచ్‌లో 180 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌త, అతను తన సహచరుడు బాబర్ ఆజం, వెస్టిండీస్ మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ వివ్ రిచర్డ్స్‌ను దాటి తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును సృష్టించాడు.
ఈ 180 పరుగుల ఇన్నింగ్స్‌తో ఫఖర్ జమాన్ తన వన్డే కెరీర్‌లో 3000 పరుగుల మార్కును దాటాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా ఫఖర్ జమాన్ నిలిచాడు. ఈ విషయంలో అతను బాబర్ ఆజం, వెటరన్ వివ్ రిచర్డ్స్‌ను దాటాడు. ఈ జాబితాలో బాబర్ ఆజం నాలుగో స్థానంలో, వివ్ రిచర్డ్స్ ఐదో స్థానంలో ఉన్నారు.
వన్డేల్లో 3000 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి ఫఖర్ జమాన్ 67 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. బాబర్ ఆజం 68 ఇన్నింగ్స్‌లలో మరియు వివ్ రిచర్డ్స్ 69 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీల్ ఆమ్లా 57 ఇన్నింగ్స్‌లతో నంబర్‌వన్‌గా ఉన్నాడు.
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్
హషీమ్ ఆమ్లా - 57 ఇన్నింగ్స్‌లలో.
షాయ్ హోప్ - 67 ఇన్నింగ్స్‌లలో.
ఫఖర్ జమాన్ - 67 ఇన్నింగ్స్‌లలో.
బాబర్ ఆజం - 68 ఇన్నింగ్స్‌లలో.
వివ్ రిచర్డ్స్ - 69 ఇన్నింగ్స్‌లలో.
ఫఖర్ జమాన్ అంతర్జాతీయ కెరీర్
ఫఖర్ జమాన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం మూడు టెస్టులు, 67 వన్డేలు, 76 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో అతను 32 సగటుతో 192 పరుగులు చేశాడు. వన్డేల్లో 49.70 సగటుతో 3082 పరుగులు సాధించాడు. అందులో 10 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 210* పరుగులు. టీ20 ఇంటర్నేషనల్‌లో 128.17 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఫఖర్ జమాన్ ఎనిమిది హాఫ్ సెంచరీల సహాయంతో 1433 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ ఇటీవలే ఒక కొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై అతి తక్కువ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా షాయ్ హోప్ నిలిచాడు. కేవలం 37 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. ఏబీ డివిలియర్స్ విదేశీ గడ్డపై 64 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు సాధించాడు. కానీ ఇప్పుడు షాయ్ హోప్ ఈ మాజీ ఆటగాడిని వెనక్కి నెట్టి రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
ఈ జాబితాలో భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై 67 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ విదేశీ గడ్డపై 100 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు చేశాడు. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌కి ఇది 14వ సెంచరీ కాగా, ఈ ఆటగాడు విదేశీ గడ్డపై 10వ సారి సెంచరీ మార్కును దాటాడు.
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?
SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం
WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే
WTC Final 2023: భరత్ vs కిషన్ - టీమ్‌ఇండియాకు పెద్ద చిక్కే వచ్చిందే!
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?