అన్వేషించండి

PAK Vs AFG: ఆఫ్ఘన్ల ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచిన పాక్ - సంచలనం నమోదవుతుందా?

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ (17: 22 బంతుల్లో, రెండు ఫోర్లు)... పాకిస్తాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 10.1 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. బలంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని అజ్మతుల్లా విడదీశాడు. ఇమామ్ ఉల్ హక్‌ను పెవిలియన్ బాట పట్టించాడు.

రెండో వికెట్‌కు బాబర్ ఆజంతో (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి మరో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అబ్దుల్లా షఫీక్. ఈ జోడి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అబ్దుల్లా షఫీక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి నూర్ అహ్మద్ పాకిస్తాన్‌కు రెండో వికెట్ అందించాడు. రాగానే సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన మహ్మద్ రిజ్వాన్ (8: 10 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ (25: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), బాబర్ ఆజం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజం అర్థ సెంచరీ కూడా పూర్తయింది. క్రీజులో కుదురుకుంటున్న దశలో సౌద్ షకీల్ అవుటయ్యాడు. కాసేపటికే బాబర్ ఆజం కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ 209 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే చివరి ఓవర్లలో షాదాబ్ ఖాన్ (40: 38 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ఇఫ్తికర్ అహ్మద్ (40: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) పాకిస్తాన్‌ను ఆదుకున్నారు. వీరు చాలా వేగంతో పరుగులు చేశారు. ఈ జోడి ఆరో వికెట్‌కు కేవలం 7.3 ఓవర్లలోనే 73 పరుగులు జోడించింది. ముఖ్యంగా ఇఫ్తికర్ అహ్మద్ సిక్సర్లతో చెలరేగాడు. షాదాబ్ ఖాన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ తనకు చక్కటి సహకారం అందించాడు. అయితే చివరి ఓవర్లో నవీన్ ఉల్ హక్ వీరిద్దరినీ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్

పాకిస్థాన్ తుదిజట్టు
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రౌఫ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget