అన్వేషించండి

England vs South Africa: వరల్డ్ కప్ లో మరో కీలక సమరం- దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్‌ అమీతుమీ

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో అగ్ర శ్రేణి జట్ల మహా సమరం ప్రారంభమైంది. శనివారం డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.

ప్రపంచకప్‌లో అగ్ర శ్రేణి జట్ల మహా సమరం ప్రారంభమైంది. శనివారం డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తమ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ తిరిగి జట్టులోకి రావాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటోంది. ఈ రెండు జట్లు.. పసికూనల చేతిలో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. ఇంగ్లాండ్‌ను అఫ్ఘానిస్థాన్‌ మట్టికరిపించగా... దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాక్‌ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు 428 సాధించిన ప్రొటీస్‌... ధర్మశాలలో నెదర్లాండ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఢిల్లీలో అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కూడా ఓడిపోయింది.  ఈ షాక్‌ల నుంచి కోలుకుని మళ్లీ గాడినపడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పసికూనల చేతిలో పరాజయం పాలైన ఈ రెండు జట్లు గెలుపుతో సెమీస్‌ వైపు బలంగా అడుగు వేయాలని భావిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్‌లు తలపడగా... బ్రిటీష్‌ జట్టు నాలుగు మ్యాచుల్లో... సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలుపొందాయి. 


 కానీ ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీగా పరుగులు సాధిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభంలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను వంద కంటే ఎక్కువ పరుగుల తేడాతో ప్రొటీస్‌ ఓడించింది. కానీ నెదర్లాండ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఇంగ్లాండ్‌ కూడా పేపర్‌పై చాలా బలంగా ఉంది. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు బెన్‌ స్టోక్స్ దూరమయ్యాడు. బెన్‌ స్టోక్స్‌ చాలా ఉత్సాహంగా ఉన్నాడని.. తిరిగి అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నారు. ఇప్పటివరకు ఆడిన మూడుమ్యాచ్‌ల్లో బట్లర్‌ 43, 20, 9 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ భారీ స్కోరు చేయాలని బట్లర్ పట్టుదలతో ఉన్నాడు. బట్లర్‌తో పాటు లివింగ్‌స్టోన్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు రూట్, డేవిడ్ మలన్ కూడా భారీ స్కోరు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. 


 దక్షిణాఫ్రికా సారధి టెంబా బవుమా ఇప్పటివరకూ జట్టును బాగానే నడిపించాడు.  ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వింటన్ డికాక్‌ రెండు శతకాలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. మార్‌క్రమ్‌... రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. కగిసో రబడ (7 వికెట్లు) మార్కో జాన్సెన్ (6 వికెట్లు) ఫామ్‌లో ఉన్నారు. లుంగీ ఎంగిడి (4 వికెట్లు) సాధించి పర్వాలేదనిపిస్తున్నాడు. 


ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ ( కెప్టెన్‌), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరణ్‌, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్


దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్.

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget