అన్వేషించండి
IND Vs ENG, Innings Highlights: ఇంగ్లండ్ ముందు పోరాడే లక్ష్యం, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
IND Vs ENG, Innings Highlights: ప్రపంచకప్‌లో భాగంగా లక్నో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు.. టీమిండియా 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
![IND Vs ENG, Innings Highlights: ఇంగ్లండ్ ముందు పోరాడే లక్ష్యం, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ODI World Cup 2023 India give target 230 runs against England Innings highlights Ekana Sports City Stadium IND Vs ENG, Innings Highlights: ఇంగ్లండ్ ముందు పోరాడే లక్ష్యం, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/29/393fd51288da9c0b9eae0a10c2d6a3201698582371357872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ( Image Source : Twitter )
ప్రపంచకప్‌లో భాగంగా లక్నో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు.. టీమిండియా 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా సారధి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత జట్టు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై.. పరుగులు రావడమే కష్టమైన వేళ భారత బ్యాటర్లను... ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టగలిగారు. బంతి బ్యాట్‌పైకి రాకపోవడం, అదనపు బౌన్స్ లభించడాన్ని బ్రిటీష్ బౌలర్లు సమర్థంగా ఉపయోగించుకున్నారు. వరుసగా వికెట్లు తీసి భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలిగారు. కానీ రోహిత్ శర్మ, సూర్య, రాహుల్ పోరాటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ గెలిచిన అయిదు మ్యాచుల్లోనూ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా... తొలిసారి బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ శర్మ తొలి ఓవర్‌ను మెయిడెన్ ఆడాడు. కానీ తర్వాత గిల్, రోహిత్ మంచి టచ్‌లో కనిపించాడు. గిల్ బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. కానీ 26 పరుగుల వద్ద శుభ్‌మన్‌గిల్‌ను బౌల్డ్ చేసిన వోక్స్ ఇంగ్లండ్‌కు తొలి వికెట్‌ను అందించాడు. 13 బంతుల్లో ఒక బౌండరీతో 9 పరుగులు చేసిన గిల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్కోరు బోర్డుపై మరో పరుగు చేరిందో లేదో ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 16 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయస్స్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వార రోహిత్ శర్మతో జత కలిసిన రాహుల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్‌గా తన వందో మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రోహిత్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో కె. ఎల్. రాహుల్ అవుటవ్వడం టీమిండియాను దెబ్బ తీసింది. 58 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన రాహుల్ విల్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. దీంతో రాహుల్- రోహిత్ మధ్య నమోదైన 91 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ అవుటైనా హిట్ మ్యాన్ పోరాటాన్ని కొనసాగించాడు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను అదిల్ రషీద్ అవుట్ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
నిలబడ్డ సూర్యకుమార్ యాదవ్
రోహిత్ శర్మ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. పిచ్‌ను అర్థం చేసుకుని తనశైలికి విరుద్ధంగా స్కై బ్యాటింగ్ చేశాడు. బ్రిటీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ టీమిండియా స్కోరును 200 దాటించాడు. తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నంలో సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగుల వద్ద సూర్యా అవుటయ్యాడు. కానీ చివర్లో బుమ్రా.. కుల్‌దీప్ యాదవ్ పర్వాలేదనిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు, క్రిస్ వోక్స్ 2, అదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు.
పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న వేళ ఈ స్కోరును ఛేదించడం అంత తేలికేమీ కాదని మాజీలు అంచనా వేస్తున్నారు. స్పిన్‌కు సహకరిస్తుండడం, అదనపు బౌన్స్ లభిస్తుండడం టీమిండియా బౌలర్లకు సహకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ భారత బౌలర్లను ఎదుర్కొని బ్రిటీష్ బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదిస్తారేమో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
తెలంగాణ
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion