అన్వేషించండి

ODI World Cup 2023: పాక్‌ నిలవాలంటే గెలవాలంతే! అఫ్గాన్ ఓటమితో పీకల మీదకి

 ODI World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్‌ పీకల మీదకు తెచ్చింది.

 భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్‌ పీకల మీదకు తెచ్చింది. ఆడిన అయిదు మ్యాచుల్లో తొలి రెండు మ్యాచులను గెలిచిన పాకిస్థాన్.. ఆ  తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గాన్‌ చేతుల్లో భంగపాటుకు గురైన పాక్‌... ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. హ్యాట్రిక్ ఓటమితో పాక్‌ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌ 4లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్క మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా పాక్‌ ఆశలు గల్లంతే. ఇప్పటికీ సెమీఫైనల్‌ చేరుకోవడానికి పాక్‌కు అవకాశమైతే ఉంది. కానీ ఈ అవకాశం చాలా క్లిష్టంగా ఉంది. 
 
టీమిండియా టాప్‌
ప్రస్తుతం ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఆడిన అయిదు మ్యాచుల్లో విజయం సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయిదు మ్యాచుల్లో నాలుగు విజయాలు.. ఒక ఓటమితో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌ 4 పాయింట్లతో అయిదో స్థానంలో ఉండగా..  అఫ్గాన్‌ కూడా అన్నే పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పాక్‌కు, అఫ్గాన్‌కు పాయింట్లు నాలుగే ఉన్నా అఫ్గాన్‌ కంటే పాక్‌ రన్‌రేట్‌ కొంచెం మెరుగ్గా ఉంది. తర్వాతి స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, శ్రీలంక ఉన్నాయి. 2019 ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో బ్రిటీష్‌ జట్టు కేవలం ఒకే విజయం సాధించింది. 
 
పాక్‌ ముందంజ వేయాలంటే..?
ఈ ప్రపంచకప్‌లో పాక్ నిలవాలంటే ఇక ఓటమి, వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అనే మాటే  ఉండకూడదు. 2019లోనూ పాక్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2019 ప్రపంచకప్‌లో  మెరుగైన రన్‌రేట్‌ కారణంగా న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. ఇప్పుడు కూడా పాక్‌ అదే స్థితిలో ఉంది. వర్షం పడకుండా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు రావాలి. ఆ నాలుగు మ్యాచుల్లోనూ పాక్‌ కచ్చితంగా గెలవాలి. చెన్నైలో దక్షిణాఫ్రికాతో, కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో, బెంగళూరులో న్యూజిలాండ్‌తో కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో పాక్‌ తలపడాల్సి ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మ్యాచుల్లో పాక్‌కు కఠిన  సవాల్‌ ఎదురు కావచ్చు. ఈ  నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి ఎదురైనా ఈ మహా సంగ్రామంలో పాక్‌ కథ ముగిసినట్లే. 
 
ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ సంచలన విజయం సాధించి పాక్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ 74, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ 58 పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2 వికెట్లు తీశారు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. అఫ్గాన్‌ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ 65.... ఇబ్రహీం జాద్రాన్‌ 74  పరుగులతో రాణించి జట్టు విజయానికి పునాది వేశారు. రహ్మత్‌ షా 77, హష్మాతుల్లా షాహిది 48 పరులతో సమయోచితంగా రాణించారు. అఫ్గాన్‌ బ్యాటర్లు రాణించడంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్‌పై ఓటమితో పాక్‌ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాక్‌ మిగిలిన 4 మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Abishek Porel Arrest: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
Gill Fitness Warning:  బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!
రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!
IND VS ENG 3rd Result Update: వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ, 
వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget