Nitish Kumar Reddy Father Tears: నితీష్ కుమార్ రెడ్డి తొలి శతకంపై తండ్రి భావోద్వేగం, రవిశాస్త్రికి సైతం కన్నీళ్లు ఆగలేదు
IND vs AUS 4th Test Nitish Kumar Reddy Century | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు.
IND vs AUS Boxing Day Test | మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డమీద టాపార్డర్ బ్యాటర్లు, దిగ్గజ ఆటగాళ్లు పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తేలికగా పరుగులు సాధిస్తున్నాడు. అరంగేట్ర సిరీస్ అయినప్పటికీ ఏ బెరుకు లేకుండా ఆడుతున్న నితీష్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కీలక సమయంలో సెంచరీ సాధించడంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నితీష్ రెడ్డి టెస్టు కెరీర్‌లో తొలి శతకం (176 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్) సాధించి రికార్డులు తిరగరాశాడు. ప్రపంచం తనవైపు చూసేలా సత్తా చాటాడు.
కీలక సమయంలో శతకంతో మెరిసిన తెలుగుతేజం..
నితీష్ కుమార్ రెడ్డి తొలి టెస్టు శతకం, అది కూడా ఆసీస్ గడ్డమీద చేయడంతో యంగ్ క్రికెటర్ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన ఇన్నేళ్ల కష్టం, త్యాగాలకు ఫలితం వచ్చిందని నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. నితీష్ రెడ్డి శతకం పూర్తి కాగానే, ప్రేక్షకులతో కలిసి లేచి చప్పట్లు కొడుతూ కొడుకు ఘనతను సెలబ్రేట్ చేసుకున్నారు. భావోద్వేగానికి లోనైన ముత్యాలరెడ్డి ఆనంద భాష్పాలు రాల్చారు. కొడుకు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిన్న పిల్లాడిలా మారిపోయారు. తన కష్టం, త్యాగాలకు ఫలితం వచ్చిందన్న సంతోషం కనిపించింది. ఆ సమయంలో కామెంటెటర్ రవిశాస్త్రి కళ్లల్లో సైతం నీళ్లు వచ్చాయంటే అది ఎంత ముఖ్యమైన సందర్భమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
When your dreams turn into reality. 🥹
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024
- Nitish Kumar Reddy's father invested so much in him, now Nitish giving it back. 👊🇮🇳 pic.twitter.com/KRm4HZAHvz
తండ్రి త్యాగాల ఫలితం నితీష్ విజయం
నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ఎందుకంత భావోద్వేగానికి లోనయ్యారని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. కొడుకు నితీష్‌ను భారత క్రికెటర్ గా చేయడానికి ముత్యాలరెడ్డి తన జాబ్ వదిలేశారు. మరో 25 ఏళ్ల ఉండగానే నితీష్ రెడ్డి కోసం ఉద్యోగానికి స్వస్తి పలికారు. కోచింగ్ కోసం ఎప్పుడూ వెంటవెళ్లి కుమారుడికి అండగా నిలిచారు. ఆటపై మక్కువ చూసి కొడుకును మరింత ప్రోత్సహించాడు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ఏదో విధంగా నితీష్ కుమార్ రెడ్డికి ట్రైనింగ్ ఇప్పించి, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగేందుకు ముత్యాలరెడ్డి ఎంతో చేశారు. అంత కష్టపడిన, త్యాగాలు చేసిన తండ్రికి కుమారుడు దేశానికి పేరు తెచ్చే ఇన్నింగ్స్ ఆడటంతో కళ్లవెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. తాను కోరుకున్నది నేడు నిజమైందంటూ పుత్రోత్సాహంతో ఆయన కేరింతలు కొట్టారు. ఆయన నవ్వుల వెనుక ఎంతో బాధ, ఎన్నో త్యాగాలు ఉన్నాయని తెలుస్తోంది.
147 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి
164/5 తో బ్యాటింగ్ ప్రారంభించినభారత్ మరో 27 పరుగులకు కీలకమైన రిషభ్ పంత్ వికెట్ కోల్పోయింది. తరువాత జడేజాతో కలిసి నితీష్ స్కోరు బోర్డును నడిపించాడు. లియన్ బౌలింగ్ లో జడేజా వికెట్ల ముందు దొరకడంతో 7 వికెట్ గా పెవిలియన్ చేరాడు. అక్కడ మొదలైంది భారత్ మరో పోరాటం. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లు ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. చెత్త బంతులను వదిలేస్తూ, ఆచితూచి ఆడూతూ ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నెం.8, నెం.9లో బ్యాటింగ్ కు దిగి 150 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లుగా నితీష్, సుందర్ రికార్డు నెలకొల్పారు. నితీష్‌కు సహకారం అందించిన సుందర్ 146 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే లయన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
Happy with that 🇮🇳
— Melbourne Cricket Ground (@MCG) December 28, 2024
Nitish Kumar Reddy brings up his maiden Test century! pic.twitter.com/VLC23NWNqQ
బుమ్రా డకౌట్ కాగా, వెలుతు లేమితో ఆట త్వరగా నిలిపివేశారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి నితీష్ రెడ్డి (105 నాటౌట్), మహ్మద్ సిరాజ్ (2) నాటౌట్‌గా నిలిచారు. ఇంకా ఆసీస్ 116 పరుగుల ఆధిక్యంలో ఉంది. లోయర్ ఆర్డర్ లో నితీష్, సుందర్ పోరాడకుంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఆడేది అరంగేట్ర సిరీస్ అయినా, నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.