అన్వేషించండి
Advertisement
Mohammed Shami: ఎంత అయినా నాన్న కదా! షమీ భావోద్వేగ పోస్ట్
Mohammed Shami: మాజీ భార్య హసీన్ జహాన్‌తో వివాదాలతో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు మహ్మద్ షమీ. చాలాకాలం తరువాత కుమార్తెను కలుసుకున్న షమ్మీ ఇంస్టాలో ఒక భావోద్వేగ పోస్ట్ చేశాడు.
Mohammed Shami met his daughter: టీమిండియా(Team India) స్టార్ బౌలర్ మహ్మద్ షమీ( Mohammed Shami) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మాజీ భార్య హసీన్ జహాన్‌తో వివాదాలతో షమీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. మాజీ భార్యతో వివాదాలతో తన కుమార్తెను కూడా షమీ చాలా ఏళ్లుగా కలుసుకోలేదు. మహ్మద్ షమీ తన కుమార్తెను కలుసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా ఏళ్ల తర్వాత తన కుమార్తెను కలవడంతో షమీ భావోద్వేగానికి గురయ్యాడు. బిడ్డను కౌగిలించుకుని షమీ చాలా ఎమోషనల్ అయిపోయాడు.
షమీ ఎమోషనల్ పోస్ట్
షమీ తన కుమార్తె ఆరియాకు దూరంగా ఉండి చాలా సంవత్సరాలు అయ్యింది. అయితే తాజాగా అరియాను కలుసుకున్న ఫొటోను షమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన కుమార్తెను కలవడం చాలా సంతోషంగా ఉందని షమీ పోస్ట్ చేశాడు. చాలా ఏళ్ల తర్వాత తన కుమార్తెను చూడడంతో భావోద్వేగానికి గురైన షమీ.. కుమార్తెను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తండ్రి కూతురు కలిసి షాపింగ్ మాల్‌లో తిరుగుతూ సందడి చేశారు. ఆ వీడియోలో షమీ తన కూతురిని 'బెబో' అని కూడా ప్రేమగా పిలవడం వినిపించింది. షమీ, అతని కుమార్తె అరియా చుట్టూ చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అరియా కోసం షమీ కొత్త బూట్లు కొన్నాడు. " చాలా కాలం తర్వాత బెబోను చూసినప్పుడు సమయం ఆగిపోయినట్లు అనిపించింది.. నీపై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను బెబో" అంటూ షమీ సోషల్ మీడియా పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు. షమీ నుంచి హసిన్ జహాన్ విడిపోయినప్పటి నుంచి అరియా తన తల్లితో కలిసి ఉంటోంది.
View this post on Instagram
షమీ పునరాగమనం ఎప్పుడో ?
గత ఏడాది 2023 వన్డే క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా మహ్మద్ షమీ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు (24) తీసిన బౌలర్ గా షమీ రికార్డు సృష్టించాడు. కానీ ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా క్రికెట్ ఆడలేకపోయాడు. షమీ ఇప్పుడు చాలా వరకు కోలుకున్నాడు, ఇటీవల తన ఫిట్‌నెస్‌పై షమీ అప్‌డేట్ ఇస్తూ, తన పునరాగమనంపై తొందరపడకూడదని చెప్పాడు. ప్రస్తుతం షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దృష్ట్యా ఆ సిరీస్‌లో జరిగే 5 మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి. అందుకే మహ్మద్ షమీ అప్పటికి పునరాగమనం చేస్తాడా లేదా అనేది చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement