అన్వేషించండి

Pakistan cricket: పాక్ క్రికెట్ లో అసలేం జరుగుతుంది , దాయాది జట్టులో మరో సంక్షోభం

Pakistan Cricket: T20 ప్రపంచ కప్ లో US జట్టు , స్వదేశంలో బంగ్లాదేశ్‌పై క్లీన్ స్వీప్ అయింది. వరుస అవమానకరమైన ఓటమి దెబ్బకి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో మరోసారి మార్పులు చోటు చేసు కున్నాయి.

Pakistan Cricket Board: కర్ణుడు మరణానికి సవాలక్ష కారణాలన్నట్లు... క్రికెట్ ప్రపంచంలో పాక్ అవస్థలకు కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక సమస్య నుంచి బయటపడి కాస్త తేరుకుంది అనుకునే లోపే..మరో సంక్షోభం పాక్ క్రికెట్ (Pakistan Cricket) ను వెంటాడుతోంది. ఒకప్పుడు ఆసియాలో భారత్(India) తో కలిసి క్రికెట్ ను ఏలిన పాకిస్థాన్.. ఇప్పుడు విజయం కోసం తీవ్రంగా అవస్థ పడుతోంది. తాజాగా బంగ్లాదేశ్(Bangladesh) తో జరిగిన టెస్టు సిరీస్ లో సొంత గడ్డపైనా ఓడి పాక్ అవమానం మూటగట్టుకుంది. గత రెండేళ్లుగా పాకిస్థాన్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేక సతమతమవుతోంది. పాక్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు, ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు... జట్టు ఎంపికలో వివక్షతో పాకిస్థాన్ విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఓవైపు పాకిస్థాన్ టీ 20 ప్రపంచకప్ గెలవడం.. సొంత మైదానంలో బంగ్లాను చిత్తుగా ఓడించడంతో పాక్ పై విమర్శల దాడి మరింత పెరిగింది. తాజాగా పాక్ ను మరో కీలక పరిణామం జరిగింది. బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయంతో పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పీసీపీ సెలెక్టర్ మహ్మద్ యూసుఫ్ తన పదవికి రాజీనామా చేశాడు. 

Read Also : ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్‌ ధోని - కెప్టెన్‌ కూల్ లీగ్‌ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ధర

యూనస్ రాజీనామా..

మహ్మద్ యూనస్ వీడ్కోలుతో పాక్ మరో సంక్షోభానికి తెరలేచింది. ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించిన యూనస్. వ్యక్తిగత కారణాలతోనే తాను సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పీసీబీ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నానని.. పాక్ జాతీయ జట్టు ఎంపికలో భాగమవ్వడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. పాక్ క్రికెట్ అభివృద్ధికి, విజయానికి దోహదపడినందుకు గర్వంగా ఉందని యూసుఫ్ అన్నాడు. పాక్ ఆటగాళ్ల ప్రతిభపై.. వారి ఆటతీరుపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని.. పాక్ క్రికెట్ త్వరలోనే గాడిన పడుతుందని యూనస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనున్న వేళ యూనస్ వీడ్కోలు పలకడం కలకలం రేపింది. ఇప్పటికే పీసీబీ సెలక్షన్‌ కమిటీ తొలి టెస్టు కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతోనే యూనస్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read Also : బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్

2004 నుంచి..
మహ్మద్ యూనస్ ను పీసీబీ  సెలెక్టర్‌గా ఎంపిక చేసింది. అయితే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ సహా ద్వైపాక్షిక సిరీస్ లలోనూ పాక్ ఓడిపోయింది. దీంతో యూసుఫ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడే యూసుఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని అంతా భావించారు. గత నెలలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత విమర్శల తాకిడి మరింత పెరిగడంతో యూసుఫ్ తన పదవికి వీడ్కోలు పలికాడు. యూసుఫ్ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడు. పాక్ జట్టు తరపున 90 టెస్టులు, 288 వన్డేలు, మూడు T20I మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 39 సెంచరీలు, 97 అర్ధసెంచరీలు ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget