Gambhir Rash Behaviour!: గంభీర్.. నా కుటుంబాన్ని బూతులు తిట్టాడు.. దాదాను అవమానించాడు.. టీమిండియా హెడ్ కోచ్ పై మాజీ క్రికెటర్ ఫైర్
మైదానంలో దూకుడుగా గంభీర్ ఉంటాడని తెలిసిందే. ఐపీఎల్లో గంభీర్ వర్సెస్ కోహ్లీ రైవల్రీ చాలాకాలంపాటు నడిచింది. గంభీర్ గతంతో తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని తాజాగా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ManoJ Tiwary Vs Gautam Gambhir: భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో అతనితో కలిసి ఆడేటప్పుడు తన ఫ్యామిలీని బూతులు తిట్టాడని, దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కూడా తులనాడినట్లు పేర్కొన్నాడు. గతంలో గంభీర్ తో కలిసి ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కత నైట్ రైడర్స్, ఢిల్లీ రంజీ జట్టు తరపున మనోజ్ ఆడాడు. అతనితో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకున్న అనుభవం ఉంది. అయితే ఒకసారి ఒక మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు గంభీర్ ఘోరంగా ప్రవర్తించాడని ఆక్షేపించాడు. తన కుటుంబాన్ని బూతులు తిట్టాడని, అలాగే దాదాపై కూడా అవాకులు చెవాకులు పేలాడని పేలాడని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మనోజ్ తివారి బెంగాల్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అతను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక, త్రుణముల్ కాంగ్రెస్ తరపున రాజకీయాల్లో కూడా పోటి చేశాడు. బెంగాల్ మంత్రిగా కూడా వ్యవహరించాడు.
ఆసీస్ టూర్లో గంభీర్ ఘోరమైన తప్పులు..
ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో జరిగిన ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో 1-3 తో టెస్టు సిరీస్ ను ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత బీజీటీని ఆసీస్ కు సమర్పించుకన్న టీమిండియా, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి ఔటయ్యింది. అంతకుముందు దశాబ్ధాలుగా కనీసం టెస్టు విజయం ఎరుగని న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ అయ్యి ఓడిపోయింది. దీంతో గంభీర్ పై విమర్శల వర్షం కురిసింది. తాజాగా మనోజ్ కూడా గంభీర్ టీమ్ సెలెక్షన్ ను తప్పు పట్టాడు. ముఖ్యంగా తను ఫేవరిటిజాన్ని ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టైన పిచ్, పేసర్లకు స్వర్గధామం లాంటి పెర్త్ పిచ్ పై ఆకాశదీప్ ను ఆడించకుండా, హర్షిత్ రాణాను ఎందుకు ఆడించాడని విమర్శించాడు. ఆకాశదీప్ అంతకుముందు జరిగిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లో చాలా చక్కగా బౌలింగ్ చేశాడని, అయితే పెర్త్ టెస్టులో అంతగా ఫస్ట్ క్లాస్ అనుభవం లేని రాణాను ఎలా ఆడించాడని తూర్పురా బట్టాడు.
కేకేఆర్ మనుషులతో టీంతో నింపేశాడు..
మరోవైపు ఐపీఎల్ 2024 టైటిల్ ను కేకేఆర్ సాధించినప్పటి నుంచి గంభీర్ పేరు మార్మోగిపోయింది. అంతిమంగా భారత హెడ్ కోచ్ పదవిని చేపట్టేవరకు గంభీర్ కు ఈ ఘనత ఉపయోగ పడింది. అయితే కోచ్ గా అయ్యాక కేకేఆర్ క సంబంధించిన మనుషులతో టీమిండియాను నింపాలని గంభీర్ భావించినట్లు వాదనలు ఉన్నాయి. హర్షిత్ రాణా, కోచింగ్ స్టాఫ్ లోని అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్ తదితరులు ఈ కోవలోకే వస్తారు. అంతగా అనుభవం లేని రాణాను కేవలం ఐపీఎల్లో కేకేఆర్ తరపున అద్భుతంగా ఆడాడనే నెపంతో ఏకంగా ఆసీస్ టూర్లో డెబ్యూ చేయించాడని మనోజ్ విమర్శించాడు. ఆకాశ దీప్ కు అన్యాయం జరిగిందని వాపోయాడు. తొలి రెండు టెస్టుల్లో విఫలమవడం ద్వారా రాణాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలిందని, అందుకే రాణాపై వేటు వేయక తప్పని పరిస్థితిలో గంభీర్ పడిపోయాడని గుర్తు చేశాడు. అలాగే తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ ను ఏ బేస్ పైన జట్టులోకి తీసుకున్నాడని ప్రశ్నించాడు. డొమెస్టిక్ లో టన్నుల కొద్ది పరుగులు చేస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ను టీమ్ లోకి తీసుకోకుండా, పడిక్కల్ ను తీసుకుని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని విమర్శించాడు. ఏదేమైనా గంభీర్ ఇప్పుడ త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఈనెలలో ఇంగ్లాండ్ తో జరిగే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ సిరీస్లలో భారత్ స్థాయిక తగ్గ ప్రదర్శన చేయకపోతే అతనిపై వేటు పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Ashwin Comments: ద్రవిడ వాదానికి అశ్విన్ మద్ధతు..!! హిందీపై సంచలన వ్యాఖ్యలు చేసిన లెజెండరీ స్పిన్నర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

