By: ABP Desam | Updated at : 07 Jul 2023 10:16 AM (IST)
మహేంద్ర సింగ్ ధోని ( Image Source : Getty )
MS Dhoni Birthday: భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధోని.. చిన్నప్పుడు సగటు మధ్య తరగతి భారతీయ యువకులు అనుభవించిన కష్టాలన్నీ అనుభవించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న ధోని క్రీడల కోటాలో ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ (టీసీ) గా ఉద్యోగం చేసిన విషయం తెలిసిందే. ఇరుకు గదుల్లో అద్దెకు ఉన్న ధోని ఆస్తులు ఇప్పుడు ఎంతో తెలుసా..?
కోటీశ్వరుడే..
కొన్ని నివేదికల ప్రకారం మహేంద్రుడి ఆస్తుల విలువ రూ. 1,040 కోట్లు. క్రికెటర్ గా ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులతో పాటు ధోని చాలాకాలంగా పలు వ్యాపారాలలో కూడా భాగమయ్యాడు. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఐపీఎల్ సాలరీ, పెట్టుబడుల రూపంలో మహేంద్రుడి సంపాదన నానాటికీ పెరుగుతోంది.
#CelebratingThala today, tomorrow and forever 🫶#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/dXZO5wm9ZP
— Chennai Super Kings (@ChennaiIPL) July 7, 2023
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనికి వార్షిక వేతనం రూ. 12 కోట్లు (గతంలో రూ. 15 కోట్ల దాకా తీసుకునేవాడు. కానీ 2022లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకని వేతనాన్ని తగ్గించుకున్నాడు) గా ఉంది.
బ్రాండ్ ఎండార్స్మెంట్స్..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని సుమారు మూడేండ్లు కావొస్తున్నా ధోని మార్కెట్ పడిపోలేదు. ఇప్పటికీ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ లో అత్యధిక ఎండార్స్మెంట్స్ కలిగిన క్రికెటర్ ధోనీనే.. కోకో కోలా, డ్రీమ్ 11, గో డాడీ, రీబాక్, ఓరియో, గల్ఫ్ ఆయిల్, ఇండియా సిమెంట్స్, కోల్గెట్ సియారమ్, టీవీఎస్, ఒప్పో కు ధోనినే బ్రాండ్ అంబాసిడర్..
పెట్టుబడులు..
కొద్దిరోజులుగా బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ తో పాటు పలు వ్యాపారాలలో కూడా ఎంట్రీ ఇస్తున్న ధోని.. ఖాతా బుక్, కార్స్ 23, శాఖాహారితో పాటు కొద్దిరోజుల క్రితమే డ్రోన్స్ బిజినెస్ లో కూడా దిగాడు. ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ గరుడా ఏరోస్పేస్ లో ధోని పెట్టుబడులు పెట్టాడు. ఫిట్నెస్ కు అధిక ప్రాధాన్యమిచ్చే ధోనికి.. బ్రాండ్ సెవెన్ లో కూడా పెట్టుబడులున్నాయి.
The MEGA launch is here! Check out Captain Cool as he checks our Mega Refurbishment Labs. Enter the whole new world of quality because #MRLPassTohGaadiFirstClass #AWholeNewWorldOfCars #Cars24 pic.twitter.com/91AyfCqqMy
— CARS24 India (@cars24india) February 11, 2022
లీగుల్లోనూ..
ఫుట్బాల్ కు వీరాభిమాని అయిన ధోనికి వ్యాపారాలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నియన్ ఫుట్బాల్ క్లబ్ కు ఓనర్ గా కూడా ఉన్నాడు. హాకీలో రాంచీ రేస్, రేసింగ్ టీమ్ (మహీ రేసింగ్) కూడా ఉన్నాయి.
సినిమాల్లో..
తన జీవితంపై బాలీవుడ్ లో తీసిన ఎంఎస్ ధోని : అన్టోల్డ్ స్టోరీ ద్వారా లాభాల్లో ధోని రూ. 30 కోట్లు తీసుకున్నాడు. చెన్నై అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ధోని.. తమిళ చిత్ర సీమలో నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ధోని అక్కడ ఓ ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు తీసేందుకు సన్నాహకాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా ప్రస్తుతం సెట్స్ లో ఉంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
WPL 2024 auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు
BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్ కొత్త చరిత్ర
IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?
Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్-10
IND vs AUS T20I: భారత్‌దే అత్యధిక విజయాల రికార్డు - పాకిస్థాన్ రికార్డు బద్దలు
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>