అన్వేషించండి

Rohit Sharma: కోహ్లీ ఆకలితో ఉన్న పులి, ఆకాశానికెత్తేసిన రోహిత్‌

Kohli has never been to NCA: విరాట్‌ కోహ్లి గురించి కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎంత సాధించినా పరుగుల ఆకలితో తపిస్తూ ఉంటాడని రోహిత్‌ అన్నాడు.

Rohit Sharma About Virat Kohli:  హైదరాబాద్‌(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India) కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది. భారత జట్టు 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టామ్‌ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించి బ్రిటీష్‌ జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు.

ఈ విజయం అనంతరం విరాట్‌ కోహ్లి గురించి కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో కోహ్లీ ఎప్పుడూ జాతీయ క్రికెట్‌ అకాడమీ(National Cricket Academy)కి  వెళ్లలేదని.. ఎంత సాధించినా పరుగుల ఆకలితో తపిస్తూ ఉంటాడని రోహిత్‌ అన్నాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ తొలి టెస్టు నేపథ్యంలో వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌(Dinesh Kartheek)తో ముచ్చటిస్తూ రోహిత్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ఇప్పటిదాకా తన కెరీర్‌లో కోహ్లీ ఎప్పుడూ జాతీయ క్రికెట్‌ అకాడమీకి  వెళ్లలేదని... అతడి ఫిట్‌నెస్‌కు ఇది నిదర్శనమని రోహిత్‌ అన్నాడు. ఆట పట్ల కోహ్లి అంకితభావాన్ని, పరుగుల పట్ల ప్రేమని చూసి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలని సూచించాడు. కోహ్లీ కవర్‌ డ్రైవ్‌, ఫ్లిక్‌, కట్‌ షాట్లు ఎలా ఆడుతున్నాడో యువ ఆటగాళ్ల గమినించాలని రోహిత్‌ దిశానిర్దేశం చేశాడు. ఇప్పటిదాకా విరాట్‌ ఎంతో సాధించాడని... దీనికే సంతృప్తి పడిపోవచ్చని అన్నాడు. 2-3 సిరీస్‌లు ఆడకపోయినా ఫర్వాలేదు అని అతడు అనుకోవచ్చని.... కానీ కోహ్లి దాహం తీరనిదని హిట్‌మ్యాన్‌ అన్నాడు. దేశానికి ఆడటాన్ని కోహ్లీ గర్వంగా భావిస్తాడని... కుర్రాళ్లు ఇదే నేర్చుకోవాలని రోహిత్‌ అన్నాడు.

తొలి టెస్ట్‌ చేజారిందిలా..

తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్‌లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. రూట్‌ 39(60), బెయిర్‌ స్టో 37(58) పరగులు చేశారు. ఆ తరువాత వచ్చిన స్టోక్స్‌ కెప్టెన్‌ ఇన్సింగ్‌ ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించి పెట్టాడు. 88 బంతులు ఆడిన స్టోక్స్‌ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు సహాయంతో 70 పరుగులు చేశాడు. టెయిలెండర్లలో టామ్‌ హార్టిలీ 24 బంతుల్లో 23 పరుగులు, చేయగా, మార్క్‌ వుడ్‌ 24 బంతుల్లో 11 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అక్షర్‌ పటేల్‌ రెండేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, అశ్విన్‌ మూడేసి వికెట్లు తీసి సత్తా చాటారు.

తొలి ఇన్సింగ్‌లో భారత్‌ బ్యాటర్లు అదరగొట్టడంతో భారీ ఆధిక్యం లభిచింది. తొలి ఇన్సింగ్‌లో 121 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన భారత ఆటగాళ్లు 436 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. బ్యాటర్లు రాణించడంతో తొలి ఇన్సింగ్‌లో భారత్‌కు 190 పరుగులు ఆధిక్యం లభించింది. , రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఒల్లీ పోప్‌ 278 బంతుల్లో 21 ఫోర్లు సహాయంతో 196 పరుగులు చేసి తుది వరకు నిలిచి జట్టు మెరుగైన స్కోర్‌ చేసేందుకు దోహదం చేశాడు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌ విజంభణతో ఒకానొక దశలో ఇంగ్లాండ్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమవుతుందని భావించారు. కానీ పోప్‌ పట్టువదలని విక్రమార్కుడిలా భారత్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించిపెట్టాడు. 420 పరుగులకు రెండో ఇన్సింగ్‌ను ఇంగ్లాండ్‌ జట్టు ముగించింది. దీంతో టీమిండియా ముందు ముగిసిన మొదటి టెస్టులో ఆ జట్టు 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది.

తన తొలి టెస్టు ఆడిన స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ (7/62) దెబ్బకు 231 పరుగుల ఛేదనలో భారత్‌ 202 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ (39) టాప్‌స్కోరర్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 58 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయంతో 39 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్‌ విఫలమయ్యారు. 35 బంతులు ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు. గిల్‌ 0(2) డకౌట్‌ కాగా, కేఎల్‌ రాహుల్‌ 22(4‘8), అక్షర్‌ పటేల్‌ 17(42), శ్రేయాస్‌ అయ్యర్‌ 13(31), రవీంద్ర జడేజా 2(20) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ తరువాత వచ్చిన వికెట్‌ కీపర్‌ శ్రీఖర్‌ భరత్‌ 28(59), రవిచంద్రన్‌ అశ్విన్‌ 28(84) పరుగులు చేసి జట్టును విజయ తీరాలవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరూ ఒకే పరుగు వ్యవధిలో వికెట్లను సమర్పించుకోవడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget