అన్వేషించండి

IRE Vs PAK: ఐర్లాండ్‌ సంచలనం, పాక్‌పై అద్భుత విజయం

Ireland vs Pakistan 1st T20I Highlights: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌పై పసికూన ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

 Ireland stun Pakistan by five wickets: టీ 20 ప్రపంచకప్‌(T 20 World Cup)నకు ముందు పాకిస్థాన్‌(Pakistan)కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌పై పసికూన ఐర్లాండ్‌(Ireland) సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి టీ 20 మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన  ఐర్లాండ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీ 20ల్లో మొదటిసారి పాకిస్థాన్‌ జట్టును ఐర్లాండ్‌ ఓడించి క్రికెట్‌ ప్రపంచాన్నే అబ్బురపరిచింది. మాజీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌లపై ఐర్లాండ్‌ మొట్ట మొదటి విజయాన్ని నమోదు చేయడం క్రికెట్‌ ప్రేమికులను అబ్బురపరిచింది. ఐర్లాండ్ 2007లో పాకిస్థాన్‌ను వన్డేల్లో ఓడించింది. ఇప్పుడు టీ 20ల్లోనూ  ఓడించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ సీనియర్‌ బ్యాటర్‌ జార్జ్ డోక్రెల్ టీ 20ల్లోవెయ్యి పరుగులు పూర్తి చేసుకుని ఈ మ్యాచ్‌ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. 

 
మ్యాచ్‌ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌, పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐర్లాండ్‌ బౌలర్లు... పాక్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. రెండో ఓవర్‌లోనే పాక్‌ కీలక బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ కేవలం ఒకే పరుగు చేసి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఏడు పరుగుల వద్ద పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత సైమ్ ఆయూబ్‌,  బాబర్‌ ఆజమ్‌ పాక్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నిర్మించారు. రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 45 పరుగులు చేసిన సైమ్ ఆయూబ్‌ను డెలనీ అవుట్‌ చేసి ఐర్లాండ్‌కు ఊరట ఇచ్చాడు. 43 బంతుల్లో 57 పరుగులు చేసిన ఆజమ్‌ను యంగ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత పాక్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫకర్‌ జమాన్‌ 20, అజామ్ ఖాన్‌ 0, షాదాబ్ ఖాన్‌ 0 పరుగులకే పెవిలియన్‌ చేరారు. వీరు వెంట వెంటనే అవుట్‌ కావడంతో పాక్‌ స్కోరు బోర్డు మందగించింది. కానీ ఇఫ్తికార్ అహ్మద్‌ 37 పరుగులతో రాణంచడంతో పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
 
ఐర్లాండ్‌ అద్భుతం
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌...ఒక్క  బంతి మిగిలి ఉండగా అద్భుత విజయం సాధించింది. ఓపెనర్‌ అండ్రూ బల్‌బిర్నీ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టెక్టర్ 36, డాక్రెల్‌ 24 పరుగులు చేయడంతో ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉండగా ఒక్క బంతి మిగిలి ఉండగానే ఐర్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. క్యాంపర్‌ రెండు ఫోర్లు, ఒక డబుల్‌, ఒక సింగిల్‌తో మ్యాచ్‌ను ఒక బంతి మిగిలి ఉండగానే ముగించి పాక్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. తమ గెలుపుపై ఐర్లాండ్‌ కెప్టెన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. మంచి లక్ష్యాన్ని ఛేజ్ చేయడం తమ బ్యాటర్ల క్రెడిట్ అంటూ మురిసిపోయాడు. ఆండ్రూ బల్బిర్నీ అద్భుతమైన నాక్ ఆడాడని... తాము గెలవడానికి అతడే కారణమని ఐర్లాండ్ కెప్టెన్ అన్నాడు. పేలవమైన ఫీల్డింగ్ కారణంగానే తాము ఓడిపోయామని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తెలిపాడు. తమ ఆరంభం బాగాలేదని నిర్వేదం వ్యక్తం చేశాడు. 180 పరుగులు మంచి లక్ష్యమే అని.. ఇంకో పది పరుగులు చేస్తే బాగుండేదని అన్నాడు. ఫీల్డింగ్‌ లోపాలు ఐర్లాండ్‌కు కలిసి వచ్చాయని బాబర్‌ అన్నాడు. ఆండ్రూ బల్బిర్నీ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Nellore News: పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
Embed widget