అన్వేషించండి

Suryakumar Golden Duck: నీ ఆటపై మబ్బులు కమ్ముతున్నాయిరా సూర్య - ఇంకెన్నాళ్లీ సున్నాలు చుట్టడం?

MI vs DC:టీమిండియా టీ20 స్టార్, పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు ఏమైంది..? సూర్యకుమార్.. ‘శూణ్య’కుమార్ గా ఉండిపోవాల్సిందేనా..?

Suryakumar Golden Duck: ‘క్రికెట్ చాలా క్రూరమైన ఆట’ అంటారు ఈ గేమ్ గురించి అ నుంచి క్ష వరకు తెలిసిన  పండితులు.  నాలుగైదు మంచి ఇన్నింగ్స్‌తో ఒక ఆటగాడిని  ఆకాశానికి ఎత్తే ఈ  క్రేజీ గేమ్.. అవే నాలుగైదు మ్యాచ్‌లలో సరైన ప్రదర్శన  చేయకుంటే అదే ఆకాశం నుంచి జాలి, దయ చూపకుండా అధో పాతాళానికి పడేస్తుంది. ప్రస్తుతం టీమిండియా టీ20 స్టార్ బ్యాటర్, ఈ ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ రెండో దశను ఎదుర్కుంటున్నాడు.  నాలుగైదు నెలల క్రితం  ‘సూర్య తోపు దమ్ముంటే ఆపు’ అని పొగిడిన నోళ్లే  ‘‘అతడు సూర్యకుమార్ కాదు ‘శూణ్య’కుమార్’’ అని నిందిస్తున్నాయి.   

సూర్య  టీమిండియాకు ఆడేది వన్డేలు, టీ20లకే.  వన్డేలలో కూడా అతడిప్పటికీ పూర్తిస్థాయిలో నమ్మదగ్గ  రెగ్యులర్ ప్లేయర్ కాలేదు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లు గాయపడితే  సూర్య తుది జట్టులోకి వస్తున్నాడు. అయితే టీ20లలో మాత్రం  భారత జట్టుకు ఇప్పటికీ అతడే నెంబర్ వన్. కానీ  గడిచిన కొన్నాళ్లుగా  సూర్య ఆట.. వైట్ బాల్ క్రికెట్ లో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరీ ముఖ్యంగా గడిచిన  నెలన్నరలో సూర్య.. క్రీజులో ఉండి పరుగులు సాధించేదానికంటే ‘సున్నాలు చుట్టేందుకే’  పరిమితమవుతున్నాడు. 

లెక్కలు దారుణం.. 

వన్డేలలో సూర్య ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ లో  సూర్య వరుసగా  మూడు మ్యాచ్ లలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అంతకుముందు  కూడా దాదాపు ఇంతే. గత పది వన్డే ఇన్నింగ్స్ లలో  సూర్య చేసిన స్కోర్లు చూస్తే.. 0, 0, 0, 14, 0, 31, 4, 6, 34, 4  (మొత్తం కలిపినా 93 మాత్రమే) దారుణంగా విఫలమవుతున్నాడు.   ఇక తాజాగా ఐపీఎల్ -16 లో ముంబై మూడు మ్యాచ్ లు ఆడింది. ఈ మూడింటిలో  సూర్య స్కోర్లు ఇవి..  15, 1, 0. 

- గడిచిన ఏడు వన్డేలు, ఐపీఎల్-16 లో మూడు మ్యాచ్‌లలో కలుపుకుని గత  పది ఇన్నింగ్స్ లలో  సూర్య చేసిన పరుగులు  0, 1, 15, 0, 0, 0, 14, 0, 31 , 4.. మొత్తం కూడినా  65 పరుగులే. 

గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో  టీ20లలో  సూర్య ఆడిన ఆటకు ఇప్పటి ఆటకు సంబంధమే లేదు.  క్రీజులోకి వచ్చి  ఓ ఇరవై, ముప్పై పరుగులు చేసినా అతడిపై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కావేమో. కానీ మరీ దారుణంగా అతడు క్రీజులోకి వచ్చి తాను ఎదుర్కున్న మొదటి బంతికే నిష్క్రమించడం  అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. 

 

టీమిండియాకూ కష్టాలే..!

సూర్య ఆట ఇలాగే కొనసాగితే అది అతడికి వ్యక్తిగతంగానే గాక  టీమిండియాకూ  ఆందోళనకరమే.  ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది.  ఈ మెగా ట్రోఫీకి  భారత జట్టుకు సూర్య చాలా కీలకం. అసలే  భారత్ ను మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్  సర్జరీకి వెళ్తే అతడు  ఎప్పుడు జట్టుతో చేరుతాడు..? అనేదాన్లో స్పష్టత లేదు.  రిషభ్ పంత్  కూడా వన్డే వరల్డ్ కప్ వరకు గాయం నుంచి కోలుకుంటాడా..? అనేదీ అనుమానమే. కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలతో పాటు సూర్య కూడా ఉంటే అప్పుడు భారత బ్యాటింగ్ లోతు మరింత బలంగా ఉంటుంది. 

ఏ ఆటగాడికైనా తన కెరీర్ లో క్షీణ దశ  సర్వ సాధారణమే. దానికి సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ ఎవరూ అతీతులు కాదు. ఈ విషయం సూర్యకు తెలియందీ కాదు.  టెక్నిక్ ను మార్చుకునేంత లోపాలు ఏమీ లేవని  సూర్యకు రవిశాస్త్రి, ఏబీ డివిలియర్స్ వంటి వాళ్లు సూచిస్తున్నారు. కావాల్సిందల్లా ఒక్క మంచి ఇన్నింగ్స్  కోసం వేచి ఉండటమే. ఆ ‘ఒక్క ఛాన్స్’తో మళ్లీ ఏడాది క్రితం నాటి ‘మిస్టర్ 360’ వస్తే అప్పుడిక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు.  తన తప్పులను తెలుసుకుని   సూర్య త్వరలోనే మునపటి బాట పట్టాలని  టీమిండియా అభిమానులు  కోరుకుంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget