By: ABP Desam | Updated at : 16 May 2023 10:05 AM (IST)
కృనాల్ పాండ్యా - రోహిత్ శర్మ ( Image Source : LSG Twitter )
LSG vs MI Preview: ఐపీఎల్ -16వ ఎడిషన్ లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న అన్ని జట్లు టాప్-4 లో ఉండేందుకు తమ సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో నేడు పాయింట్ల పట్టికలో 3,4 వ స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కీలక మ్యాచ్ ఆడనున్నాయి. లక్నోలోని ఎకనా ప్టేడియంలో జరుగబోయే 63వ లీగ్ మ్యాచ్‌లో లక్నో - ముంబైలు నేటి రాత్రి 7.30 గంటలకు తాడో పేడో తేల్చుకోనున్నాయి.
ముంబైకు స్పిన్ పరీక్ష..
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి గత రెండు మ్యాచ్‌లలో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని టాప్ -3కి ఎగబాకింది ముంబై. ఆ జట్టుకు బలమంతా బ్యాటింగే. కెప్టెన్ రోహిత్ విఫలమవుతున్నా ఇషాన్ కిషన్ అంతంతమాత్రంగానే ఆడుతున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం బీస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇటీవలే గుజరాత్ తో మ్యాచ్ లో సెంచరీ బాది జోరు మీదున్న సూర్యకు నెహల్ వధేరా, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ లు కూడా జతకలిస్తే ముంబైకి తిరుగుండదు. గుజరాత్ తో మ్యాచ్ లో సూర్యతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన విష్ణు వినోద్ కూడా నేటి మ్యాచ్ లో రాణించాలని ముంబై కోరుకుంటున్నది.
Also Read: ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ - పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?
అయితే ముంబైకి లక్నోలో స్పిన్ పరీక్ష తప్పదు. లక్నో పిచ్ స్లో టర్నర్. ఇక్కడ ఢిల్లీతో జరిగిన ఫస్ట్ మ్యచ్ లో తప్ప 160 ప్లస్ స్కోరు నమోదుకాలేదు. గుజరాత్, బెంగళూరులు 140 బిలో స్కోరు చేసి కూడా విజయం సాధించాయి. రెండోసారి బ్యాటింగ్ చేస్తే మాత్రం లక్నో స్పిన్ త్రయం అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యాలను ఎదుర్కోవడం ముంబైకి అంత ఈజీ కాదు. అదీగాక స్పిన్ ఆడటంలో ఇషాన్ తో పాటు గ్రీన్, డేవిడ్ కూడా ఇబ్బందిపడుతున్నారు.
"𝘞𝘦𝘭𝘤𝘰𝘮𝘦 𝘵𝘰 𝘓𝘶𝘤𝘬𝘯𝘰𝘸, 𝘙𝘰𝘩𝘪𝘵." 🤗 pic.twitter.com/kPBTv0wyIe
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023
లక్నోకు అదే బలం, బలహీనత..
స్వంత గ్రౌండ్ లో ఆడుతుండటం లక్నోకు బలమే అయినా అదే బలహీనత అని కూడా చెప్పక తప్పదు. ఇక్కడ ఆరు మ్యాచ్ లు ఆడిన లక్నో రెండింట మాత్రమే గెలిచింది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ చేతిలో ఓడింది. చెన్నైతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓడిన మూడు మ్యాచ్ లలో లక్నో ఛేదన చేసే క్రమంలో తడబాటుకు గురై విజయం ముంగిట బోల్తా కొట్టింది. ఆ జట్టు గత మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఓడించినా లక్నోలో ఎలా ఆడతారనేది ఆసక్తికరం. స్లోపిచ్ పై కైల్ మేయర్స్, స్టోయినిస్, పూరన్ లు ముంబై స్పిన్నర్లను తట్టుకుని ఏ మేరకు నిలబడగలరనేది చూడాలి.
ముంబైలో కూడా పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నారు. వీరికి తోడు స్పిన్ పిచ్ కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా హృతిక్ షోకీన్ కు ఛాన్స్ ఇస్తే లక్నోకు కష్టాలు తప్పవు.
ప్లేఆఫ్స్ దిశగా..
ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే అది టాప్ -2కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నైకి 15, ముంబైకి 14 పాయింట్లున్నాయి. ఇక లక్నో గెలిస్తే.. ముంబైని వెనక్కినెట్టి టాప్ -3కి వెళ్లడమే గాక ప్లేఆఫ్స్ బెర్త్ ను మరింత ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ లక్నో ఓడితే మాత్రం ఆ జట్టుకు ఆర్సీబీ, రాజస్తాన్ తో నాలుగో స్థానానికి పోటీ తప్పకపోవచ్చు.
Our boys train hard in Lucknow ahead of #LSGvMI for crucial 2️⃣ points 💙👉 https://t.co/wc8p5074qI
— Mumbai Indians (@mipaltan) May 16, 2023
🎥 Enjoy the full episode of #MIDaily on the MI App 📱#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 MI TV pic.twitter.com/1rgIOE24yq
తుది జట్లు (అంచనా):
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అయూష్ బదోని, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్
ఇంపాక్ట్ సబ్ : అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, విష్ణువినోద్, కామెరూన్ గ్రీన్, నెహల్ వధేర, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, కుమార్ కార్తీకేయ
ఇంపాక్ట్ సబ్ : హృతీక్ షోకీన్, తిలక్ వర్మ
Also Read: ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఆడిన పాకిస్తాన్ ప్లేయర్లు వీరే - హయ్యస్ట్ ఎవరికో తెలుసా?
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
WTC Final 2023: మళ్లీ గిల్లుకుంటున్న జాఫర్, వాన్ - ట్విటర్ వార్‌లో వీళ్ల రూటే సెపరేటు
World Test Championship Final: అశ్విన్‌ను తప్పించడం తెలివితక్కువ చర్య - రోహిత్‌పై దుమ్మెత్తిపోస్తున్న మాజీలు
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?