By: ABP Desam | Updated at : 12 May 2023 12:34 PM (IST)
యశస్వి జైస్వాల్ ( Image Source : Rajasthan Royals Twitter )
Yashasvi Jaiswal: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ సాధించిన రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లూ తన పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసినందుకు గాను కెఎల్ రాహుల్ (14 బంతులలో హాఫ్ సెంచరీ).. జైస్వాల్ కు సాల్యూట్ చేస్తున్నట్టుగా ట్విటర్ లో జిఫ్ ఇమేజ్‌ను షేర్ చేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో జైస్వాల్.. 13 బంతులలోనే హఫ్ సెంచరీ చేశాడు. నితీశ్ రాణా వేసిన ఫస్ట్ ఓవర్ లోనే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో పాటు ఓ డబుల్ తో 26 పరుగులు చేసిన జైస్వాల్.. తర్వాత ఏడు బంతులలో 1, 4, 6, 4, 4, 4, 1 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
మొత్తంగా నిన్నటి మ్యాచ్ లో 47 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జైస్వాల్ పై కెఎల్ రాహుల్ తో పాటు నయా 360 సూర్యుకుమార్ యాదవ్ కూడా ట్విటర్‌లో ప్రశంసలు కురిపంచాడు. ‘స్పెషల్ నాక్, స్పెషల్ ప్లేయర్. టేక్ ఎ బో జైస్వాల్’ అని ట్వీట్ చేశాడు.
.@ybj_19 pic.twitter.com/DUEHrIUfxo
— K L Rahul (@klrahul) May 11, 2023
ఇక ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అయితే యశస్విని భారత్ త్వరలో ఆస్ట్రేలియాతో ఆడబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఆడించాలని సూచించాడు. ట్విటర్ వేదికగా వాన్ స్పందిస్తూ.. ‘నేనే గనక సెలక్టర్ అయితే గాయపడ్డ కెఎల్ రాహుల్ ప్లేస్ లో యశస్వి జైస్వాల్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు సెలక్ట్ చేస్తా. అంత గొప్ప ఆటగాడు అతడు. రాబోయే రోజుల్లో అతడే సూపర్ స్టార్ అవుతాడు..’అని ప్రశంసల్లో ముంచెత్తాడు.
I would have selected @ybj_19 as KL Rahuls replacement for the World Test championship final … He is that good .. he is going to be a superstar .. #India
— Michael Vaughan (@MichaelVaughan) May 11, 2023
జైస్వాల్ ఆటకు టీమిండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ కూడా ముగ్దుడయ్యాడు. నిన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన కొద్దిసేపటికే కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీస్ లో ‘వావ్.. నేను చూసిన ఇన్నింగ్స్ లలో ఇది బెస్ట్. వాట్ ఎ టాలెంట్ @యశస్వి జైస్వాల్’అని పోస్ట్ చేశాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్విటర్ లో ‘ఈ కుర్రాడు చాలా స్పెషల్. అతడి క్లీన్ హిట్టింగ్‌ను ఆసాంతం ఆస్వాదించా..’అని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైతే యశస్విపై ట్వీట్ల వర్షం కురిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్, రాజస్తాన్ రాయల్స్ ట్విటర్ లో షేర్ చేసింది.
Social media went berserk after young @ybj_19's batting brilliance 🤯
— IndianPremierLeague (@IPL) May 12, 2023
Who better than the current purple cap holder, @yuzi_chahal to chat up with the young sensation 😄
Lovely chat this between the duo 🤝 - By @28anand #TATAIPL | #KKRvRR | @rajasthanroyals
Full Interview… pic.twitter.com/sbk31k3sig
ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!