IPL 2023: అమ్మో ముంబై ఫైనల్‌కు రావొద్దు! - సీఎస్కే బౌలింగ్ మెంటార్‌కు ఎల్ క్లాసికో భయం
ఐపీఎల్- 2023 ఎడిషన్‌లో నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ముంబై ఇండియన్స్ ఢీకొననుంది.
IPL 2023 Playoffs: ఐపీఎల్ చూసేవారికి ‘ఎల్ క్లాసికో’ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లను ఐపీఎల్ ఫ్యాన్స్ ఎల్ క్లాసికోగా అభివర్ణిస్తారు. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ కూడా ఎల్ క్లాసికో కావాలని ఇరు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఫైనల్‌లో చెన్నై - ముంబై తలపడతాయా..? లేదా..? అది నేటి రాత్రి తేలనుండగా.. సీఎస్కే మాజీ పేసర్ డ్వేన్ బ్రావో మాత్రం ఫైనల్‌కు ముంబై రావొద్దని కోరుకుంటున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా నేటి (మే 26) రాత్రి ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగబోయే పోరులో గెలిచిన జట్టు మే 28న ఇదే వేదికపై జరుగబోయే ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొననుంది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
కాగా.. ఫైనల్‌లో చెన్నైతో ముంబై ఆడకూడదని బ్రావో భయపడుతుండటం గమనార్హం. దీనిపై స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో బ్రావో మాట్లాడుతూ.. ‘అమ్మో.. ఫైనల్‌లో ముంబైతో ఆడాలని నేను కోరుకోవడం లేదు. ప్లేఆఫ్స్‌లో క్వాలిఫై అయిన టీమ్స్ అన్నీ క్వాలిటీ టీమ్సే. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను ఫైనల్‌లో ముంబైతో ఆడాలని కోరుకోవడం లేదు. ముంబైలో ఉండే నా ఫ్రెండ్ కీరన్ పొలార్డ్‌కు కూడా ఈ విషయం తెలుసు. ఏదేమైనా మిగిలిన జట్లకు ఆల్ ది బెస్ట్. సీఎస్కేతో ఫైనల్ ఆడబోయే టీమ్ ఏదో మేం వేయిట్ చేస్తున్నాం..’ అని చెప్పాడు.
— Chennai Super Kings (@ChennaiIPL) May 23, 2023
లక్నో మ్యాచ్‌కు ముందే బ్రావో ఈ కామెంట్స్ చేయడం విశేషం. బ్రావో భయడుతున్నట్టుగానే చెన్నైలో రోహిత్ సేన.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడాతో జయభేరి మోగించి నేడు గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నది. ‘ప్లేఆఫ్స్‌కు చేరాక ముంబైని అడ్డుకోవడం కష్టం’ అన్న అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తూ రోహిత్ సేన దూసుకుపోతున్నది. ఇక నేడు అహ్మదాబాద్‌లో కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే మే 28న ఎల్ క్లాసికోకు రంగం సిద్ధమైనట్టే...! అయితే క్వాలిఫయర్ - 1 లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. అహ్మదాబాద్‌లో ఆ జట్టుకు ఘనమైన రికార్డు, అభిమానుల మద్దతు కూడా పుష్కలంగా ఉంది.
DJ elevating the party! 🥳🕺#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/N3iKpOu9Xf
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023
ముంబై - చెన్నై రికార్డులు..
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 38 సార్లు తలపడ్డాయి. ఇందులో లీగ్ దశలో 29 సార్లు.. ప్లేఆఫ్స్‌లో 5, ఫైనల్స్ లో నాలుగు మ్యాచ్ లు ఆడాయి. లీగ్ దశలో 16 మ్యాచ్ లను ముంబై గెలవగా చెన్నై 13 గెలుచుకుంది. ప్లేఆఫ్స్ లో 5 మ్యాచ్‌లలో ముంబై రెండుసార్లు.. చెన్నై 3 మ్యాచ్ లలో గెలవగా.. నాలుగు ఫైనల్స్ లో ముంబై మూడు సార్లు నెగ్గగా చెన్నై ఒక్కసారి మాత్రమే టైటిల్ కొట్టింది.