Axar Patel Meha Marriage: రాహుల్ తర్వాత పెళ్లి పీటలెక్కిన అక్షర్ - ప్రేయసిని పెళ్లాడిన ఆల్‌రౌండర్!
Axar Patel Meha Marriage: టీమ్‌ఇండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి మెహాను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
Axar Patel Meha Marriage:
టీమ్‌ఇండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి మెహాను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య వడోదరలో వీరి పెళ్లి వేడుక జరిగింది.
Wedding pics of Axar Patel & Meha Patel. pic.twitter.com/kAjsiO9K4H
— Johns. (@CricCrazyJohns) January 27, 2023
గురువారం రాత్రి నుంచి అక్షర్ పటేల్, మెహాకు సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి. గురువారం రాత్రి అక్షర్ పటేల్ సన్నిహితుల మధ్య ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. తన వివాహం గురించి ఈ టీమ్‌ఇండియా క్రికెటర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
Congratulations Axar Patel & Meha Patel. pic.twitter.com/Ld5kpKa6jk
— Johns. (@CricCrazyJohns) January 27, 2023
గతేడాది జనవరి 20న అక్షర్ పటేల్, మెహా నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తమ చిత్రాలను పంచుకున్నారు. గురువారం ఈ కొత్త జంట 'మన్ మేరీ జాన్' పాటకు నృత్యం చేస్తున్న వీడియో వైరల్ అయింది.
పెళ్లి కోసమే అక్షర్ పటేల్ న్యూజిలాండ్ సిరీసుకు దూరమయ్యాడు. ఏడాది కాలంగా టీమ్‌ఇండియాకు అతడు కీలకంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. 2014లో అరంగేట్రం చేసిన అతడు ఈ మధ్యే బిజీ అయ్యాడు. మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మధ్యే శ్రీలంకతో జరిగిన సిరీసులో అక్షర్ దూకుడు ప్రదర్శించాడు. ఒక మ్యాచులో 31 బంతుల్లోనే 65 బాదేశాడు. టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇప్పటి వరకు అతడు 8 టెస్టులు, 49 వన్డడేలు, 40 టీ20లు ఆడాడు. వరుసగా 79, 56, 37 వికెట్లు పడగొట్టాడు.
MR. & MRs. Axar Patel.#AxarPatel #weddingnight pic.twitter.com/LxDYLd8fGd
— Meha Patel (@Meha2026) January 26, 2023
టీమ్‌ఇండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. మూడు రోజులు ముందే కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి పీటలు ఎక్కారు. బాలీవుడ్, క్రికెట్ తారలు, బంధువుల మధ్య వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరికి కనీసం రూ.65 కోట్ల విలువైన బహుమతులు వచ్చాయని సమాచారం.
Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k
— Meha Patel (@Meha2026) January 26, 2023
#AxarPatel #AxarPatelWedding #MehaPatel pic.twitter.com/FEUZF7HxEV
— Meha Patel (@Meha2026) January 26, 2023