India Vs Sri Lanka: అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే- నేడు లంకతో భారత్ వన్డే.. పొంచి ఉన్న వరుణుడి ముప్పు
Ind Vs SL1st ODI: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 3-0తో గెలిచిన T20I సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భారత్ శ్రీలంక తలపడనున్నాయి.
Colombo Match: శ్రీలంక పర్యటనలో టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి టచ్‌లో ఉన్న టీమిండియా ఇక వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచుల పొట్టి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రోహిత్, విరాట్ మెరుపులు చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సంపాదించాలని లంక జట్టు కూడా భావిస్తోంది. టీ 20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. నూతన కోచ్ సనత్ జయసూర్య ఈ మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాడన్నది ఆసక్తిగా మారింది.
రోహిత్, విరాట్‌పైనే చూపంతా..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. భారత్ విజయంతో వన్డే సిరీస్‌ను న్ని ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో లంకను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. చివరి టీ 20లో గెలుపు అంచుల వరకు వచ్చి తర్వాత మ్యాచ్‌ను సూపర్ ఓవర్ తీసుకెళ్లడం లంకకు కాస్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అయితే ఈ వన్డే సిరీస్‌కు భారత సూపర్ స్టార్లు తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతం అయింది. టీ 20 ప్రపంచకప్ తర్వాత టీ 20ల నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఆ రిటైర్‌మెంట్ ప్రకటన తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతుండడంతో అందరి కళ్లు వారిపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ సన్నాహాలను కూడా ఈ సిరీస్ ప్రారంభిస్తుంది. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండడం కూడా ఆసక్తి రేపుతోంది. శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా జనవరిలో టీమిండియా తరపున ఆడాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లలో ఎవరు కీపింగ్ చేస్తారో చూడాలి. మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ భారత్ బౌలింగ్ ఎటాక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా జట్టులో ఉంటారు.
శ్రీలంకకు పెను సవాల్
భారత్‌తో వన్డే సిరీస్‌లో శ్రీలంక ముందు భారీ సవాల్ ఉంది. టీ20I సిరీస్‌ను కోల్పోయిన లంక... ఇప్పుడు వన్డే సిరీస్ అయినా కైవసం చేసుకోవాలని చూస్తుంది. వన్డేల్లో ఏకైక డబుల్ సెంచరీ చేసిన పాతుమ్ నిసంకపై భారీ ఆశలు పెట్టుకుంది. మతీషా పతిరణ, దిల్షాన్ మధుశంకలు దూరం కావడం లంకను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆల్ రౌండర్ వనిందు హసరంగ కూడా ఈ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, KL రాహుల్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
శ్రీలంక జట్టు: పాతుమ్ నిసంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత
Also Read: పారిస్ ఒలింపిక్స్‌లో ఓడిపోయిన సింధు - చైనా అమ్మాయి హే బిన్ జియావో చేతిలో పరాజయం