అన్వేషించండి

IND vs SL 3rd ODI: పోరాటమే లేకుండా సమర్పించేశాం, వన్డే సిరీస్‌ లంక కైవసం

India vs Sri Lanka: మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. భారత్‌తో జరిగిన కీలకమైన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన లంక... సిరీస్‌ను చేజిక్కించుకుంది.

Sri Lanka beats India by 110 runs to win series 2-0: భారత్‌(India)తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక(Srilanka) కైవసం చేసుకుంది. కీలకమైన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన లంక... సిరీస్‌ను కైవసం చేసుకుంది. . 1997 తర్వాత తొలిసారిగా భారత జట్టు...శ్రీలంకకు వన్డే సిరీస్‌ను సమర్పించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ టైగా ముగియగా... రెండు, ముడు వన్డేలో లంక ఘన విజయాలు నమోదు చేసింది. శ్రీలంక స్పిన్ మంత్రం ముందు... భారత స్టార్‌ ఆటగాళ్లు తేలిపోయారు. కీలకమైన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు... ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు కేవలం 138 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను లంక 2-0తో కైవసం చేసుకుంది. 

 
లంక బ్యాటర్ల పోరాటం
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. శ్రీలంకకు మరోసారి ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆవిష్క ఫెర్నాండో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. శతకానికి కేవలం నాలుగు పరుగుల ముందు ఆవిష్క అవుటయ్యాడు. 102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆవిష్క 96 పరుగులు చేసి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో అవుటయ్యాడు. మరో ఓపెనర్‌ పాతుమ్ నిసంక 45 పరుగులు చేసి అవుటయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండీస్‌ కూడా అర్ధ శతకంతో రాణించాడు. టాపార్డర్‌ రాణించడంతో  లంక  భారీ స్కోరు దిశగా పయనించింది. అయితే  పుంజుకున్న భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. అసలంక 10, సమరవిక్రమ 0, లియాంగే 8 పరుగులే చేసి అవుటయ్యారు. కానీ చివర్లో కమిందు మెండిస్‌ చెలరేగడంతో లంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
 
పోరాటమేదీ..?
249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అసలు పోరాటమే లేకుండా చేతులెత్తేసింది. 37 పరుగుల వద్ద ప్రారంభమైన వికెట్ల పతనం నిర్విరామంగా సాగింది. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ కాస్త పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా లంక బౌలర్ల  ముందు తేలిపోయారు. రోహిత్ శర్మ 35, శుభ్‌మన్ గిల్ 6, విరాట్ కోహ్లీ 20, శ్రేయస్ అయ్యర్ 8, రిషభ్‌ పంత్‌ 6, అక్షర్ పటేల్ 2 , రియాన్ పరాగ్ 15 , శివమ్‌ దూబే 9 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. వాషింగ్టన్ సుందర్‌ 30 పరుగులతో కాసేపు పోరాడాడు. కానీ లంక బౌలర్ల ధాటికి వీరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. లంక బౌలర్లలో వెల్లలాగే నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు.  భారత జట్టు కేవలం 138 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను లంక 2-0తో కైవసం చేసుకుంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Haryana Polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
AAP నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడికి  280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
KTR: సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
Delhi Liquor Case  : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి   బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
Embed widget