India vs South Africa 1st Test Live Score: చెలరేగిన సఫారీ పేసర్లు, 24 రన్స్‌కే టీమిండియా 3 వికెట్లు - కోహ్లీపైనే ఆశలు!
IND vs SA Live Score Boxing Day Test Day 1: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా టాపార్డర్ తడబాటుకు లోనైంది. కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
![India vs South Africa 1st Test Live Score: చెలరేగిన సఫారీ పేసర్లు, 24 రన్స్‌కే టీమిండియా 3 వికెట్లు - కోహ్లీపైనే ఆశలు! India vs South Africa 1st test Live Score Rohit Sharma Jaiswal and Shubman Gill depart early India vs South Africa 1st Test Live Score: చెలరేగిన సఫారీ పేసర్లు, 24 రన్స్‌కే టీమిండియా 3 వికెట్లు - కోహ్లీపైనే ఆశలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/36e3e2170d3e4b7c8f4d859f246c2afd1703584492236233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs South Africa Match Live Score Updates: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా టాపార్డర్ తడబాటుకు లోనైంది. కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం నుంచి భారత్(Team India ), దక్షిణాఫ్రికా(Sout Africa) జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ మొదలైంది. సెంచూరియన్(Centurion Cricket Ground ) వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగా, టాస్ నెగ్గిన సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
Selfless captain Rohit Sharma 🔥#INDvsSApic.twitter.com/o9LljU7vWQ
— Shivam 🚩 (@shivam_pal_18) December 26, 2023
చెలరేగిన సఫారీ పేసర్లు..
సెంచూరియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు మంచి ఆరంభం లభించ లేదు. యశస్వీ జైశ్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బంతితో నిప్పులు చెరిగాడు. రబాడ ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బంతికి రోహిత్ క్యాచౌట్ గా వెనుదిరిగాడు. ఆపై వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ కు దిగాడు. అంతలోనే మరో ఓపెనర్ ఔటయ్యాడు. నాండ్రీ బర్గర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (17) ఇచ్చిన క్యాచ్ ను కైల్ పట్టడంతో భారత్ 23 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
Nandre Burger bowling to Virat Kohli with 4 slips & a gully; This is Test Cricket at it's best! 🤯 #INDvsSA pic.twitter.com/Y0XFviimkV
— Prathamesh Avachare (@onlyprathamesh) December 26, 2023
వెంటనే మరో వికెట్..
ఆపై వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ (2) మూడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు ఇబ్బంది పడిన గిల్ ను నాండ్రీ బర్గర్ ఓట్ చేశాడు. దాంతో కేవలం 24 పరుగులకే టీమిండియా ముగ్గురు టాపార్డర్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి భారత్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది. రన్ మేషిన్ విరాట్ కోహ్లీ 7, శ్రేయస్ అయ్యర్ 9 పరుగులతో ఆడుతున్నారు. సఫారీలు అటాకింగ్ బౌలింగ్ తో పాటు బ్యాటర్లకు ఛాన్స్ దొరకకుండా ఫీల్డింగ్ సెట్ చేశాడు కెప్టెన్. గతంలో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గని భారత్ ఈసారి కచ్చితంగా ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు స్వదేశంలో రాణిస్తున్న ఆటగాళ్లు సఫారీ గడ్డపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)