Boxing Day Test Record: 87 ఏళ్ల బ్రాడ్ మన్ రికార్డు బద్దలు.. ప్రేక్షకులు పోటెత్తడంతో బాక్సింగ్ డే టెస్టు కొత్త రికార్డు
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్ గా బీజీటీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇరుజట్ల మధ్య పోరును చూడటానికి ప్రేక్షకులు పోటెత్తడంతో 87 ఏళ్ల రికార్డు బద్దలైంది.
Sir Donald Bradman Time Record Shatters; భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు అంచానాలకు మించి సంచలనాలు నమోదు చేస్తోంది. బాక్సింగ్ డే టెస్టు హిస్టరీలోనే అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన టెస్టు మ్యాచ్ గా నిలిచింది. ఐదు రోజులు కలిపి 350,700 మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. నిజానికి చివరిరోజు 51 వేలమంది హాజరైతే కొత్త రికార్డు నమోదవుతుందని నిర్వాహకులు భావించగా, అంతకు ఎక్కువ సంఖ్యలోనే ప్రేక్షుకులు హాజరై రికార్డు నమోదు కావడంలో సహకరించారు.
🚨 ALL-TIME MCG TEST ATTENDANCE RECORD 🚨
— Melbourne Cricket Ground (@MCG) December 30, 2024
We've officially surpassed the attendance record set in 1936/37 when Australia faced England — a Test which spanned six days! pic.twitter.com/Kykmz8KY65
బ్రాడ్ మన్ కాలం నాటి రికార్డు..
పరుగలు వీరుడు, ఆసీస్ కు చెందిన దిగ్గజ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ క్రికెట్ ఆడుతున్నప్పుడే ఈ సంఖ్యలో జనం స్టేడియాలకు పోటెత్తేవారు. 1937 యాషెస్ సిరీస్ సందర్భంగా ఈ ఫీట్ పీక్స్ కు చేరుకుంది. ఆ టెస్టుకు 350,535 మంది హాజరై, అత్యధిక మంది హాజరైన బాక్సింగ్ డే టెస్టుగా చరిత్ర పుటల్లో నిలిచి పోయింది. తాజాగా భారత్, ఆసీస్ మ్యాచ్ కు అంతకు 165 మంది ఎక్కువ మందే హాజరై ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఇక సోమవారం టికెట్టు రేటును పది ఆస్ట్రేలియన్ డాలర్ల కనీస మొత్తానికి నిర్ణయించడం కూడా కలిసొచ్చింది.
తొలిరోజు అత్యధిక మంది..
ఇక ఈ టెస్టు తొలి రోజున అత్యధిక సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. టోటల్ గా 87, 242 మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చారు. రెండో రోజు 85,147 మంది, మూడో రోజున 83,073 మంది హాజరవగా, ఆదివారం అకస్మాత్తుగా ఈ సంఖ్య 43,67 మందికి పడిపోయింది. అయితే చివరిరోజు 51, 371 మంది హాజరవ్వడంతో పాత రికార్డు బద్దలైంది.
ఒక టెస్టులో అత్యధిక మంది హాజరైన రికార్డు మనదేశంలోనే జరిగింది. 1999లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్టు మ్యాచ్ కు 465,000 మంది హాజరవడంతో ప్రపంచ రికార్డు నమోదైంది. సమీప భవిష్యత్తులో ఈ రికార్డును దాటడం ఎవరి వల్ల కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 25 ఏళ్లుగా ఈ రికార్డు అలాగే కొనసాగుతోంది. ఇక ప్రస్తుత బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులు చేయగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌటైంది ఇక రెండో ఇన్నింగస్్ లో 235 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లోని 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని, మొత్తంగా 340 పరుగుల టార్గెట్ ను భారత్ కు నిర్దేశించింది. ఈ మ్యాచ్ ను డ్రా చేయడానికి భారత్ చెమటోడుస్తోంది.