India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..
IND vs AUS: రాయపూర్ లో నేడు జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది.
ఆస్ట్రేలియా(Austrakia)తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల T 20 సిరీస్T20 Series) లో భారత్(Bharat) కీలక పోరుకు సిద్దమైంది. రాయపూర్(Raipur)లో నేడు జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. ఫలితం ఇక్కడ తేలుతుందా లేదా ఆఖరి మ్యాచ్ సిరీస్‌లో నిర్ణయమవుతుందా అన్నది చూడాలి. మూడో T20 మ్యాచ్ లో మాక్స్వెల్ అద్భుత బ్యాటింగ్ తో గెలిచినా ఆసిస్... సిరీస్ సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు సెరిస్ ఇక్కడే గెలవాలని సూర్యకుమార్ యాదవ్ నేత్రత్వంలోని జట్టు పట్టుదలగా ఉంది. అయితే టీమ్ఇండియాకు బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. యువ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. నెగ్గాలంటే ఆఖరి ఓవర్ల బౌలింగ్ బాగా మెరుగుపడడం అత్యవసరం. మూడో మ్యాచ్‌లో బౌలర్లు చివరి రెండు ఓవర్లలో 40కి పైగా పరుగులను కాపాడలేకపోయారు. చివరి ఓవర్లో 21 సహా నాలుగు ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 68 పరుగులిచ్చాడు. ప్రసిద్ధ కృష్ణ పాటు అవేష్ ఖాన్ బౌలింగ్లోనూ వైవిధ్యం లోపించింది. అర్ష్దీప్ సింగ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు 131 పరుగులిచ్చి కేవలం రెండు వికెట్లే పడగొట్టాడు. ఈ ముగ్గురుపేసర్లు గాడిన పడాలని టీమ్ ఇండియా కోరుతుంది. 22 పరుగులు చేసినా ఓడిపోవటం భరత్ ను ఆందోళన పరుస్తుంది. బౌలర్లు పుంజుకోకుంటే భారత్‌కు ఇబ్బందులు తప్పవు.
ఈ మ్యాచ్లో మాక్స్వెల్ ఆడడం లేదు. IDI టీమ్ ఇండియా కు సానుకూల అంశం. బ్యాటింగ్ లో భారత్ చాలా బలమ్‌గా ఉంది. రుతురాజ్, సూర్య, రింకూసింగ్, మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ భారత్‌కు పెద్ద సానుకూలాంశం. యశస్వి, ఇషాన్, సూర్యకుమార్, రింకూలతో లైనప్ బలంగా ఉంది. ఇక చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి వచ్చాడు. తిలక్ వర్మ స్థానంలో అతడు తుది జట్టులో ఆడే అవకాశం ఉంటుంది. మ్యాక్స్‌వెల్, స్మిత్, జంపా వంటి కీలక పాత్రలు స్వదేశానికి వెళ్లిపోయినా.. ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కంగారూ తుది జట్టులో అనేక మార్పులు జరుగుతున్నాయి. హెడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్లను భారత బౌలర్లు నిలువరించాల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోతే చివరి మ్యాచ్ కీలకం గా మారనుంది.
అయితే ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి ఏ మాత్రం వీల్లేదు. కానీ ఈ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటే టీమిండియా సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాయ్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని తెలుస్తోంది. దీంతో మరోసారి భారీస్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు లేవన్న వాతావరణ శాఖ అంచనా..
తుది జట్లు
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయేస్ అయ్యర్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్/ ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్
ఆస్ట్రేలియా:
మ్యాథ్యూ వేడ్ (కెప్టెన్ ), హార్డీ, ట్రావిస్ హెడ్, షార్ట్, మెక్‌డెర్మాట్, టిమ్ డేవిడ్, క్రిస్ గ్రీన్, డ్వార్‌షుయిస్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, సంఘా